Virgin Boys Telugu Movie: రొమాంటిక్ కామెడీ
ABN , Publish Date - Apr 08 , 2025 | 03:33 AM
గీతానంద్, మిత్రా శర్మ జంటగా దయానంద్ తెరకెక్కిస్తున్న వర్జిన్ బాయ్స్ రొమాంటిక్ కామెడీగా రూపొందుతోంది. ఈ సినిమా ప్రేమకథతో పాటు భావోద్వేగాలను కలగలిపి, యువతను ఆకట్టుకునే కథాంశంతో వస్తోంది
గీతానంద్, మిత్రా శర్మ జంటగా దయానంద్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ కామెడీ ‘వర్జిన్ బాయ్స్’. రాజా దరపునేని నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ చిత్రం నుంచి ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఈ సినిమాలో ఆకట్టుకునే ప్రేమకథతో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు ఉంటాయి. యువతను ఆకర్షించే కథాంశంతో వస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుంది’’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేశ్, డీఓపీ: వెంకట ప్రసాద్, సంగీతం: స్మరణ్ సాయి.