Chiyaan Vikram: ‘తంగలాన్’కు ఒక్కటి కాదు వంద సీక్వెల్స్ చేయాలని అనుకుంటున్నాం..

ABN , Publish Date - Aug 17 , 2024 | 05:56 PM

చియాన్ విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. ఈ సినిమా ఈ నెల 15న థియేటర్స్‌లో విడుదలై బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందించగా.. నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. సినిమా సక్సెస్‌ను పురస్కరించుకుని మేకర్స్ శుక్రవారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు.

Chiyaan Vikram Thangalaan Success Meet

చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’ (Thangalaan). ఈ సినిమా ఈ నెల 15న థియేటర్స్‌లో విడుదలై బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందించగా.. నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. సినిమా సక్సెస్‌ను పురస్కరించుకుని మేకర్స్ శుక్రవారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. (Thangalaan Success Meet)

Also Read- Thangalaan Review: ‘బంగారం’లాంటి సినిమా..


ఈ కార్యక్రమంలో హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram Speech at Thangalaan Success Meet) మాట్లాడుతూ.. మధుర శ్రీధర్, రైటర్స్ రాకేందు మౌళి, భాస్కరభట్ల వంటి వారంతా సొంత సినిమా గురించి మాట్లాడినంత ప్రేమగా ‘తంగలాన్’ గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. వారు అంతగా ప్రేమించారు కాబట్టే అలా హార్ట్ ఫుల్‌గా మాట్లాడగలిగారు. నా పాత్రకు డబ్బింగ్ చెప్పిన ఆర్సీఎం రాజుకి థ్యాంక్స్. సినిమాకు మీరు ఇస్తున్న రెస్పాన్స్ వీడియోలు చూస్తున్నప్పుడు మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తున్నాయి. అంత సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ‘తంగలాన్’ రిలీజ్‌కు ముందే నేను పా రంజిత్, జ్ఞానవేల్‌కి చెప్పాను. ఇది తెలుగు ఆడియెన్స్ బాగా రిసీవ్ చేసుకునే సినిమా అవుతుందని.. ఎందుకంటే ఇది మట్టి మనుషుల కథ. ఇలాంటి కంటెంట్ డ్రివెన్ మూవీస్‌ను తెలుగు ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు. నేను శివపుత్రుడు చేసినప్పుడు.. ఆ సినిమా తెలుగులో ఆదరణ పొందుతుందా అని సందేహం వెలిబుచ్చారు కానీ తెలుగులో శివపుత్రుడు ఘన విజయాన్ని అందుకుంది. నేను చెప్పినట్లే ‘తంగలాన్’కు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ప్రాంతంలో ప్రేక్షకులు ఎంతో ప్రేమను చూపిస్తున్నారు.


Chiyaan-Vikram.jpg

నాతో ఇలాంటి స్పెషల్ మూవీ చేసినందుకు దర్శకుడు పా రంజిత్‌కు థ్యాంక్స్. పా రంజిత్‌కు నాపై ఎంతో నమ్మకం ఉంది. ఆయన నమ్మకం వల్లే నేను ఈ సినిమా చేయగలిగాను. ‘తంగలాన్’కు పార్ట్ 2 చేయాలని నేను, పా రంజిత్, జ్ఞానవేల్ అనుకున్నాం. తప్పకుండా ఈ సినిమాకు సీక్వెల్ వస్తుంది. ఒక్కటి కాదు వంద సీక్వెల్స్ చేయాలని అనుకుంటున్నాం. ప్రొడ్యూసర్ జ్ఞానవేల్‌కు తంగలాన్ పెద్ద హిట్ ఇచ్చింది. నెక్ట్స్ వచ్చే ‘కంగువ’ రికార్డ్స్ బ్రేక్ చేసే మూవీ అవుతుంది. ఆయన మరో సినిమా కూడా రాబోతోంది. అది కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. నేను తెలుగు స్టేట్స్‌లో ప్రమోషన్ కు వెళ్లినప్పుడు నా సినిమాలన్నీ చూశామని ఆడియెన్స్ చెప్పారు. ఓటీటీలో రిలీజైన నా సినిమాల గురించి కూడా వారు చెబుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. (Thangalaan Movie)

lso Read- Kalki 2898AD OTT: ‘కల్కి 2898AD’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

మాళవిక ఆరతి పాత్రలో చాలా బాగా నటించింది. జీవీ ప్రకాష్ కుమార్ మా సినిమాకు వస్తున్న ప్రతి ప్రశంసలో ఉన్నారు. ఆయన హీరోగా, నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫెంటాస్టిక్ జర్నీ చేస్తున్నారు. ‘తంగలాన్’కు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. నేను రెండు గొప్ప వార్తలు విన్నాను.. ఒకటి ‘తంగలాన్’కు వస్తున్న మంచి కలెక్షన్స్, రెండవది ‘పొన్నియన్ సెల్వన్’కు నాలుగు జాతీయ అవార్డ్స్ అని. ఈ రెండూ చాలా హ్యాపీనెస్ ఇచ్చాయని అన్నారు.

Read Latest Cinema News

Updated Date - Aug 17 , 2024 | 05:56 PM

Thangalaan: చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ ట్రైలర్ విడుదలకు డేట్ ఫిక్సయింది

Thangalaan: చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ విడుదల ఎప్పుడంటే?

Thangalaan: నెట్ ఫ్లిక్స్ లో తంగలాన్, ఎప్పుడంటే ....

Thangalaan: మాస్‌ యాక్షన్  బొమ్మ... కొత్త డేట్‌ వచ్చింది!

Thangalaan: ‘తంగలాన్‌’ ట్రైలర్ భ‌యంక‌రంగా ఉంటుంది: జీవీ ప్రకాష్‌