Thangalaan: నెట్ ఫ్లిక్స్ లో తంగలాన్, ఎప్పుడంటే ....
ABN , Publish Date - Jan 17 , 2024 | 02:47 PM
విక్రమ్ వైవిధ్యంగా నటించిన 'తంగలాన్' నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. పా రంజిత్ దీనికి దర్శకుడు, ఈ సినిమా జనవరి 26న విడుదలకావాల్సి ఉండగా, వాయిదా పడింది.
తమిళ నటుడు విక్రమ్ వైవిధ్యంగా కనపడనున్న సినిమా 'తంగలాన్'. దీనికి పా రంజిత్ దర్శకత్వం వహిస్తే, కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మాత. ఈ సినిమాలో ఇంకా పార్వతి, మాళవిక మోహనన్, పశుపతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా జనవరి 26న విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు పోస్ట్ పోన్ చేశారు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలకానుంది.
ఈ సినిమా కథా నేపధ్యం ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది అని అంటున్నారు. ఇందులో విక్రమ్ ఒక వైవిధ్యమైన ఆటవిక నాయకుడి పాత్రలో కనపడతారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే ఒక ట్రైబల్ లీడర్ గా విక్రమ్ ఇందులో కనపడతారు అని అంటున్నారు. తన భూమిని బ్రిటిష్ ప్రభుత్వం అక్రమంగా తీసుకుంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన భూమిని తిరిగి తెచ్చుకునేందుకు తంగలాన్ ఎలా పోరాటం సాగించాడు అనే ఇతివృత్తంతో ఈ సినిమా నిర్మించారు అని ఒక వార్త నడుస్తోంది. (Chiyaan Vikram's Thangalaan is going to stream on Netflix in April)
ఇదిలా ఉండగా, 'తంగలాన్' జనవరి 26న విడుదలకావాల్సి ఉండగా, ఈ సినిమా ఇప్పుడు ఏప్రిల్ లో విడుదల అవుతుంది అని చిత్ర నిర్వాహకులు కొన్ని రోజుల క్రితమే ఒక పోస్టర్ విడుదల చేశారు. అయితే ఇప్పుడు ప్రముఖ ఓటిటి ప్లేట్ ఫార్మ్ అయిన నెట్ ఫ్లిక్స్ (Netflix) ఇప్పుడు ఈ సినిమాని ఏప్రిల్ లో తమ ఓటిటి లో చూడొచ్చు అని తన సామజిక మాదేమాల్లో ప్రచారాలు చేస్తోంది. అయితే అది కూడా ముందు థియేటర్ లో విడుదలైన తరువాత మాత్రమే చూడొచ్చు అని చెప్పింది.
ఈ 'తంగలాన్' సినిమా అన్ని భాషల్లో కూడా వీక్షించవచ్చు అని నెట్ ఫ్లిక్స్ అందులో పేర్కొంది. ఈ సినిమా విక్రమ్ కెరీర్ లో మరొక మైలురాయి అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్త విడుదల తేదీ ఎప్పుడు అన్నది ఇంకా చిత్ర నిర్వాహకులు ప్రకటించలేదు, కానీ ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.