Thangalaan: చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ ట్రైలర్ విడుదలకు డేట్ ఫిక్సయింది

ABN , Publish Date - Jul 09 , 2024 | 11:10 AM

విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నటిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.

Thangalaan Movie Still

విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’ (Thangalaan). ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ (Pa Ranjith) రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా (KE Gnanavel Raja) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పార్వతీ తిరువోతు (Parvathy Thiruvothu), మాళవిక మోహనన్ (Malavika Mohanan) హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోన్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ మేకర్స్ ఓ అప్‌డేట్ వదలారు. ఈ చిత్ర ట్రైలర్ విడుదల ఎప్పుడో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


Thangalaan.jpg

‘తంగలాన్’ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 10వ తేదీన (Thangalaan Trailer Release Date) విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్‌ ఎలాంటి స్పందనను రాబట్టుకుందో తెలిసిందే. ట్రైలర్ కూడా అద్భుతమైన స్పందనను రాబట్టుకుంటుందని, అందరినీ అలరిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ‘తంగలాన్’ సినిమా కోసం విక్రమ్ మారిపోయిన తీరు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాబోతోన్న ‘తంగలాన్’ ట్రైలర్, సినిమాపై కూడా మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి. పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై తదితరులు ఇతర పాత్రలలో నటిస్తోన్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్ విడుదల అనంతరం.. చిత్ర ప్రమోషన్స్‌‌పై మరింత దృష్టిపెట్టాలని చిత్రబృందం భావిస్తోంది.

Updated Date - Jul 09 , 2024 | 11:10 AM

Thangalaan : రా అండ్ రస్టిక్.. రిలీజ్ డేట్ ఫిక్స్

Thangalaan: మాస్‌ యాక్షన్  బొమ్మ... కొత్త డేట్‌ వచ్చింది!

Thangalaan: విక్రమ్ ‘తంగలాన్‌’ ఎంత వరకు వచ్చిందంటే..

Thangalaan: నెట్ ఫ్లిక్స్ లో తంగలాన్, ఎప్పుడంటే ....

Thangalaan: ‘తంగలాన్‌’ ట్రైలర్ భ‌యంక‌రంగా ఉంటుంది: జీవీ ప్రకాష్‌