Thangalaan: మాస్‌ యాక్షన్  బొమ్మ... కొత్త డేట్‌ వచ్చింది!

ABN , Publish Date - Jul 01 , 2024 | 11:59 AM

తమిళ్‌ స్టార్‌ చియాన్‌ విక్రమ్‌ నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ మూవీ ‘తంగలాన్‌’. పా.రంజిత్‌ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్‌, జియో స్టూడియోస్‌ బ్యానర్స్‌పై ప్రొడ్యూసర్‌ కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు

Thangalaan: మాస్‌ యాక్షన్  బొమ్మ... కొత్త డేట్‌ వచ్చింది!

తమిళ్‌ స్టార్‌ చియాన్‌ విక్రమ్‌ నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ మూవీ ‘తంగలాన్‌’. పా.రంజిత్‌ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్‌, జియో స్టూడియోస్‌ బ్యానర్స్‌పై ప్రొడ్యూసర్‌ కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం స్వాతంత్య్రానికి  పూర్వం నేపథ్యానికి వ్యతిరేకంగా, తంగలన్‌ కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నివాసుల కథగా ఈ సినిమాను తెరెక్కిస్తునట్లు తెలుస్తోంది. మాళవిక మోహనన్‌, పశుపతి, పార్వతి, డేనియల్‌ కాల్టిగరోన, హరికృష్ణన కీలక పాత్రధారులు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయిన విడుదల తేదీని ఖరారు చేయలేదు. మొదట జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు. పలు కారణాలతో వాయిదా పడింది.

thangalan.jpg

తదుపరి ఏప్రిల్‌లో విడుదల అని ప్రకటించారు అప్పుడూ కాలేదు. తాజాగా మేకర్స్‌ మరో డేట్‌ ప్రకటించారు. అల్లు అర్జున్  నటించిన 'పుష్ప 2: ది రూల్‌ సినిమా పోస్టుపోన్‌ కావడంతో చాలా చిన్న సినిమాలు ఆగస్ట్‌ 15న రిలీజ్‌ అయ్యేందు రెడీ అయ్యాయి. ఇప్పుడు విక్రమ్‌ సినిమా కూడా అదే డేట్‌లో రిలీజ్‌ కానున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

తాజాగా ఈ చిత్రంపై సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. ‘సినిమా మ్యూజిక్‌ పనులు పూర్తయ్యాయి. నాకు సాధ్యమైనంతవరకు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాను. సినిమా అద్భుతంగా వచ్చింది. త్వరలోనే మైండ్‌ బ్లోయింగ్‌ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. మరో ఇండియన్‌ మూవీ చరిత్ర సృష్టించనుంది’ అని పేర్కొన్నారు. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్‌ కాబోతుంది.

Updated Date - Jul 01 , 2024 | 03:56 PM