Thangalaan: ‘తంగలాన్‌’ ట్రైలర్ భ‌యంక‌రంగా ఉంటుంది: జీవీ ప్రకాష్‌

ABN , Publish Date - Jul 03 , 2024 | 09:15 AM

చియాన్‌ విక్రమ్, పా.రంజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘తంగలాన్‌’ చిత్రం నుంచి త్వరలోనే ప్రతి ఒక్కరినీ భయపెట్టే అద్భుతమైన ట్రైలర్‌ రాబోతుందని ఆ చిత్ర సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్ తెలిపారు.

Thangalaan

చియాన్‌ విక్రమ్ (Chiyaan Vikram), పా.రంజిత్ (Pa Ranjith) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘తంగలాన్‌’ (Thangalaan) చిత్రం నుంచి త్వరలోనే ప్రతి ఒక్కరినీ భయపెట్టే అద్భుతమైన ట్రైలర్‌ రాబోతుందని ఆ చిత్ర సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్ (G.V.Prakash Kumar) తెలిపారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ పూర్తయిందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు జీవీ ప్రకాష్‌ కుమార్‌ తన ఎక్స్‌ హ్యాండిల్‌లోరీసెంట్‌గా ఓ ట్వీట్‌ చేశారు.

thanga.jpg

‘తంగలాన్‌’ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కంపోజింగ్‌ పూర్తయింది. ఈ సినిమాకు నా బెస్ట్‌ ఎఫర్ట్‌ చేశాను. ఈ అద్భుతమైన చిత్రం కోసం ఎదురు చూస్తున్నా. ప్రేక్షకులను విస్మయానికి గురిచేసే భయంకరమైన, అద్భుతమైన ట్రైలర్‌ త్వరలోనే విడుదల కానుంది. భారతీయ చిత్రపరిశ్రమ ఈ సినిమా కోసం అమితాసక్తితో ఎదురు చూస్తుంది’ అని జీవీ ప్రకాష్‌ కుమార్ (G.V.Prakash Kumar) పేర్కొన్నారు.


Vikram-Thangalaan.jpg

ఈ సినిమాలో చియాన్‌ విక్రమ్ (Chiyaan Vikram), మాళవిక మోహనన్ (Malavika Mohanan), పశుపతి తదితరులు నటించారు. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో పీరియాడికల్‌ ఫిల్మ్‌గా ఈ సినిమాను దర్శకుడు పా.రంజిత్ (Pa Ranjith) రూపొందించారు. చాలాకాలం క్రితమే షూటింగ్‌ పూర్తి చేసుకున్నప్పటికీ పలు కారణాల వల్ల సినిమా విడుదలలో జాప్యం నెలకొంది. చివరకు ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేసేలా దర్శక నిర్మాతలు ప్లాన్‌ చేశారు.

Updated Date - Jul 03 , 2024 | 09:15 AM