Thangalaan: చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ విడుదల ఎప్పుడంటే?

ABN , Publish Date - Jul 19 , 2024 | 06:14 PM

విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. ఈ మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా? అని ఎదురు చూస్తున్న వారి కోసం మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నట్లు‌గా మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.

Chiyaan Vikram in Thangalaan

విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’ (Thangalaan). ఈ మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా? అని ఎదురు చూస్తున్న వారి కోసం మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) సందర్భంగా ఆగస్టు 15న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నట్లు‌గా మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ‘తంగలాన్’ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ (Pa Ranjith) రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.

Parvathi.jpg

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. చియాన్ విక్రమ్ సరసన పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘తంగలాన్’ సినిమా ట్రైలర్‌ హ్యూజ్ రెస్పాన్స్‌ను రాబట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. (Thangalaan Release Date)

Also Read-Suman: ఏపీలో సినిమా ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే.. ఆ కండీషన్లు పెట్టకూడదు


Thangalaan.jpg

అలాగే ‘మనకి మనకి..’ అంటూ వదిలిన లిరికల్ సాంగ్ కూడా ఛాట్ బస్టర్ అయ్యింది. విలక్షణ నటుడి నుంచి వస్తోన్న ఈ విలక్షణ చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతిని కలిగిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఆ కొత్త ప్రపంచం ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం ఆగస్ట్ 15 వరకు వెయిట్ చేయక తప్పదు. పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై తదితరులు ఇతర పాత్రలలో నటించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jul 19 , 2024 | 06:14 PM

Thangalaan: చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ ట్రైలర్ విడుదలకు డేట్ ఫిక్సయింది

Thangalaan : రా అండ్ రస్టిక్.. రిలీజ్ డేట్ ఫిక్స్

Thangalaan: ‘గంగమ్మ’గా పార్వతీ తిరువోతు..

Thangalaan: మాస్‌ యాక్షన్  బొమ్మ... కొత్త డేట్‌ వచ్చింది!

Thangalaan: ‘తంగలాన్‌’ ట్రైలర్ భ‌యంక‌రంగా ఉంటుంది: జీవీ ప్రకాష్‌