Committee Kurrollu: ‘కమిటీ కుర్రోళ్ళు’.. దిగ్గజాల ప్రశంసలు అందుకుంటున్నారు

ABN, Publish Date - Aug 13 , 2024 | 12:43 PM

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై య‌దు వంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి గ్రాండ్‌గా విడుదల చేశారు. సూపర్ స్టార్ మహేష్‌తో పాటు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్, హీరో నాని, డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్‌, డైరెక్ట‌ర్ క్రిష్‌, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమా సాధించిన స‌క్సెస్‌ను అప్రిషియేట్ చేశారు.

Committee Kurrollu Movie Still

నిహారిక కొణిదెల (Niharika Konidela) సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై య‌దు వంశీ (Yadhu Vamsi) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu). తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి గ్రాండ్‌గా విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకుంటోన్న ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రేక్షకుల నుంచే కాకుండా.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన దిగ్గజాల ప్రశంసలు సైతం ఈ సినిమాకు దక్కుతుండటం విశేషం. సూపర్ స్టార్ మహేష్‌ (Super Star Mahesh Babu)తో పాటు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి (SS Rajamouli), స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ (Sukumar), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) స‌హా హీరో నాని (Nani), డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్‌ (Nag Ashwin), డైరెక్ట‌ర్ క్రిష్‌ (Krish), రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ (Devi Sri Prasad) ఈ ‘క‌మిటీ కుర్రోళ్ళు’ సాధించిన స‌క్సెస్‌ను అప్రిషియేట్ చేశారు. (Celebrities Praises on Committee Kurrollu Movie)


ఇది యంగ్ టీమ్ సాధించిన పెద్ద విజ‌యం. ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు థియేట‌ర్స్‌లో మంచి ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయ‌ని తెలిసింది. డైరెక్ట‌ర్ య‌దు వంశీ, నిర్మాత నిహారిక స‌హా ఎంటైర్ యూనిట్‌కు నా అభినంద‌న‌లు - రాజ‌మౌళి

‘కమిటీ కుర్రోళ్ళు’ మంచి విజ‌యం సాధించింద‌నే వార్త విన‌టం చాలా ఆనందంగా ఉంది. ఎంటైర్ టీమ్‌కు అభినంద‌న‌లు. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను. నిర్మాత నిహారిక‌కు, డైరెక్ట‌ర్ యదు వంశీకి బ్లాక్‌బ‌స్ట‌ర్ సాధించినందుకు అభినంద‌లు. అలాగే మ‌న్యం ర‌మేష్‌గారికి, వంశీ నందిపాటిగారికి కూడా కంగ్రాట్స్ - సుకుమార్‌

‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నిహారిక తల్లికి అభినందనలు. మీ కష్టానికి ఇది అర్హమైన విజయం. ఈ సినిమా కోసం మీ టీమ్ చేసిన కృషి మరియు అంకితభావం నిజంగా స్ఫూర్తిదాయకం. మీ టీమ్ ఎఫర్ట్‌కు అభినందనలు అలాగే.. ఈ కథకు జీవం పోసిన దర్శకుడు యదు వంశీకి ప్రత్యేక అభినందనలు - రామ్ చరణ్

నిహారిక కొణిదెల‌తో పాటు ‘కమిటీ కుర్రోళ్ళు’ టీమ్‌కు అభినంద‌నలు. చాలా మంది యంగ్ టాలెంట్ ఈ సినిమాతో త‌మ‌ని తాము ప్రూవ్ చేసుకున్నారు. - నాగ్ అశ్విన్‌

‘కమిటీ కుర్రోళ్ళు’ గురించి చాలా గొప్ప‌గా విన్నాను. నిహారిక కొణిదెల‌తో పాటు ఎంటైర్ టీమ్‌కు అభినంద‌న‌లు - నాని

‘కమిటీ కుర్రోళ్ళు’ రోల‌ర్ కోస్ట‌ర్ మూవీ. స్నేహం, ప్రేమ‌, భావోద్వేగాల‌న్నీ చ‌క్క‌గా కుదిరాయి. అంతా కొత్తవారైనా చాలా అద్భుతంగా న‌టించారు. డైరెక్ట‌ర్ య‌దు వంశీకి హ్యాట్సాఫ్‌.. అద్భుత‌మైన విజ‌యాన్ని ద‌క్కించుకున్న నిర్మాత నిహారిక‌కు అభినంద‌న‌లు - క్రిష్

‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రానికి చాలా పెద్ద కంగ్రాట్స్‌. ఇది అద్భుత‌మైన విజయం. తొలి చిత్రంతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన నిహారిక‌కు అభినంద‌న‌లు. మీరంతా గొప్ప ప్ర‌య‌త్నం చేశారు. ఇలాంటి విజ‌యాల‌ను మ‌రెన్నింటినో సాధించాలి - దేవి శ్రీ ప్ర‌సాద్


అంతకు ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu) చిత్రంలో సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నాన్ని అభినందిస్తూ ప్రేక్ష‌కులు ఈ సినిమాను ఆద‌రించార‌ని.. వీక్ డేస్‌లో కూడా ఈ సినిమా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతుంద‌ని, క‌లెక్ష‌న్స్ మ‌రింత పెరుగుతాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి.

Updated Date - Aug 13 , 2024 | 02:14 PM