Committee Kurrollu:  ‘కమిటీ కుర్రోళ్ళు’ నుంచి హుషారైన పాట 

ABN , Publish Date - Jul 12 , 2024 | 06:26 PM

నిహారిక కొణిదెల (Niharika konidela) సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ (Pink Elephant Pictures) ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం  ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurroll). 

నిహారిక కొణిదెల (Niharika konidela) సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ (Pink Elephant Pictures) ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం  ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurroll).  సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య, విషిక ..ముఖ్య పాత్రల్లో  నటించారు.  య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. ప‌క్కా ప్లానింగ్‌తో మేక‌ర్స్ అనుకున్న స‌మ‌యానికి క‌న్నా ముందే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయ‌టం ఇక్కడ విశేషం. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  శుక్రవారం   ఈ చిత్రం నుంచి జాతర పాటను హీరో విశ్వక్ సేన్  రిలీజ్ చేశారు. 'సందడి సందడి' అంటూ సాగే ఈ పాటను సింహాచలం మన్నెల రచించగా.. అనుదీప్ దేవ్, రేణూ కుమార్, శ్రీనివాస్ దరిమిశెట్టి ఆలపించారు. అనుదీప్ దేవ్ మంచి ఊపునిచ్చే బాణీని అందించారు.

Kurralu-2.jpg

ఈ లిరికల్ వీడియోలోని విజువల్స్, జాతర సన్నివేశాలు, కుర్రాళ్ల ధూంధాం స్టెప్పులు బాగున్నాయి. రాజు ఎడురోలు ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్‌గా పని చేశారు. ఈ చిత్రానికి వెంకట సుభాష్  చీర్ల, కొండల రావు అడ్డగళ్ల సంభాషణలు రాశారు. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్లు ప్లాన్ చేస్తున్నారు. సాయి కుమార్ ,గోపరాజు రమణ,బలగం జయరాం,శ్రీ లక్ష్మి ,కంచరపాలెం కిషోర్ ,కిట్టయ్య ,రమణ భార్గవ్ కీలక పాత్రధారులు. 

Updated Date - Jul 12 , 2024 | 06:41 PM