Committee Kurrollu: ‘కమిటీ కుర్రోళ్లు’కు రష్మిక మందన్నా సపోర్ట్

ABN , Publish Date - Jun 26 , 2024 | 10:24 PM

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధ దామోదర్ స్టూడియో బ్యానర్లపై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. పద్మజ కొణిదెల, జయలక్ష్మీ అడపాక నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎదు వంశీ దర్శకుడు. ఈ సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాద్ వర్మ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ప్రేమ గారడీ’ అనే లిరికల్ సాంగ్‌ని రష్మిక మందన్నా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా విడుదల చేశారు.

Rashmika Mandanna Launches Committee Kurrollu Movie Song

‘అమ్మాయికి మనసులోని ప్రేమను చెప్పాలంటే, ఆమె ఆ ప్రేమకు వెంటనే ఎస్ చెప్పాలంటే సాధార‌ణ విష‌యం కాదు.. మ‌రీ పుట్టి పెరిగిన ప‌ల్లెటూర్లో అయితే ఎవ‌రెక్క‌డ చూస్తారోన‌ని అమ్మాయి, అబ్బాయి ప్రేమ ఊసులు చెప్పుకోవ‌టం మ‌రీ క‌ష్టం. అలాంటి క‌ష్టాన్ని హాయిగా అనుభ‌విస్తోన్న కుర్రాడు మ‌న‌సులోని ‘ప్రేమ గారడీ..’ని న‌చ్చిన అమ్మాయికి ఎలా చెప్పాడ‌నేది తెలుసుకోవాలంటే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu) సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.

Also Read-Kalki 2898AD Review: మహాభారత యుద్ధం తరువాత ఏమి జరిగిందో ఊహాత్మకంగా...

నిహారిక కొణిదెల (Niharika Konidela) సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధ దామోదర్ స్టూడియో బ్యానర్లపై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. పద్మజ కొణిదెల, జయలక్ష్మీ అడపాక నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎదు వంశీ (Yadhu Vamsi) దర్శకుడు. ఈ సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాద్ వర్మ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ప్రేమ గారడీ’ అనే లిరికల్ సాంగ్‌ (Prema Gaaradi Lyrical Song)ని రష్మిక మందన్నా (Rashmika Mandanna) తన సోషల్ మీడియా ఖాతా ద్వారా విడుదల చేశారు.


Commitee.jpg

అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తోన్న ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలోని ‘ప్రేమ గారడీ..’ పాటను కిట్టు విస్సాప్రగడ రాయగా అర్మాన్ మాలిక్ పాడారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. రీసెంట్‌గా రిలీజైన ‘గొర్రెలా..’ అంటూ పాటకు, టీజ‌ర్‌కు మంచి స్పందన వచ్చిందని.. సినిమా కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. రాజు ఎడురోలు ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jun 26 , 2024 | 10:24 PM