Mansoor Ali Khan: దిగొచ్చిన మన్సూర్.. త్రిషకు క్షమాపణలు! మంగళసూత్రం ఇచ్చి ఆశీర్వదిస్తా అంటూ..
ABN , First Publish Date - 2023-11-24T16:20:43+05:30 IST
మొత్తానికి గడిచిన పది రోజులుగా వార్తల్లో నిలిచిన త్రిష, మన్సూర్ అలీఖాన్‌ల ఇష్యూ దాదాపు ముగింపునకు వచ్చేసినట్టే ఉంది. ఈ వివాదం విషయంలో మన్సూర్ అలీఖాన్ వెనక్కి తగ్గి త్రిషకు క్షమాపణలు తెలిపి సమస్యకు ఓ పులిస్టాప్ పెట్టినట్టుగా తెలుస్తోంది.
మొత్తానికి గడిచిన పది రోజులుగా వార్తల్లో నిలిచిన త్రిష(Trisha), మన్సూర్ అలీఖాన్(Mansoor Ali Khan)ల ఇష్యూ దాదాపు ముగింపునకు వచ్చేసినట్టే ఉంది. ఓ కార్యక్రమంలో మన్సూర్ త్రిషపై నోరుజారడం దానిపై ఆమె స్పందించడం, సినిమా నటులు రియాక్ట్ కావడం, జాతీయ మహిళా కమిషన్, చెన్నై కోర్టు రంగంలోకి దిగడం, నేను నా మాట మీదే ఉంటానంటూ మన్సూర్ తెగేసి చెప్పడం వంటి పనులు చకచకా జరిగిపోయాయి.
అయితే తాజాగా ఇప్పుడు ఈ వివాదం విషయంలో మన్సూర్ అలీఖాన్ వెనక్కి తగ్గి త్రిషకు క్షమాపణలు తెలిపి సమస్యకు ఓ పులిస్టాప్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ ‘త్రిషపై నా కెలాంటి దురుద్ధేశాలు లేవని, ఆమె పెళ్లికి నేనే వెళ్లి మంగళసైత్రం ఇచ్చి ఆశీర్వదిస్తాను’ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఇప్పుడు ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నది. దీనికి త్రిష స్పందిస్తూ ‘తప్పులు మానవ సహజం, క్షమ అనేది దైవత్వం వంటిది, అత్యుత్తమమైనది’ అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేసింది.
గత నెలలో వచ్చిన లియో విజయోత్సవ వేడుక అనంతరం ఓ తమిళ యూట్యూబ్ కు ఇంటర్వ్యూ ఇస్తు నేను చాలా సినిమాలలో హీరోయిన్లతో బెడ్ సీన్లలో నటించానని, ఈ మధ్య లియో (Leo) సినిమాలోనూ త్రిషతో బెడ్‌రూమ్ సీన్ ఉంటుందని అనుకున్నానని, కానీ డైరెక్టర్ ఆమెతో ఒక్క సీను కూడా పెట్టలేదని బాధ పడ్డానన్నారు. కనీసం త్రిష (Trisha)ను చూసే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు సోషళ్ మీడియాలో వైరల్ త్రిష వద్దకు చేరడం ఆమె ఈ విషయంపై సీరియస్ అయి ఘూటుగా స్పందించడంతో దేశమంతటా చర్చనీయాంశం అయి ఆమెకు మద్దతు తెలుపుతూ చాలామంది నటులు ముందుకు వచ్చి మన్సూర్ మాటలను ఖండించారు.
ఆపై ఈ ఇష్యూ ఇంకా పెద్దగా మారడంతో త్రిషను అగౌరపరిచేలా వ్యాఖ్యలు చేసిన మన్సూర్‌పై చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు డీజీపీని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది.‘త్రిషను ఉద్దేశించి మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలను మేం ఖండిస్తున్నాం. అతనిపై ఐపీసీ 509బి (ఎలకా్ట్రనిక్ మీడియాలో లైంగిక ఆరోపణలు)తో పాటు ఇతర సంబంధిత సెక్షన్లపై కేసు నమోదు చేయాలని తమిళనాడు డీజీపీకి ఆదేశాలు జారీ చేస్తున్నాం. మహిళలపై హింసను ప్రేరేపించే ఇలాంటి చర్యలను సహించేది లేదు’ అని కమిషన్ ఎక్స్‌లో ట్వీట్ చేసింది. దీంతోపాటు నడిగర్ సంఘం కలుగజేసుకుని ఎలాంటి వివరణ కోరకుండా మన్సూర్ త్రిషకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పత్రికా ప్రకటనను సైతం విడుదల చేశారు. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు నుంగంబాక్కం పోలీసులు మన్సూర్‌పై కేసు నమోదు చేశారు.
దీంతో మన్సూర్ అలీఖాన్ (Mansoor Ali Khan) ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెన్నైలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడో మాట్లాడిన విషయాన్ని త్రిష దృష్టికి తీసుకెళ్ళి రాద్దాంతం సృష్టిస్తున్నారని, త్రిష గురించి నేను ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదని ఆమెను అభినందించానని, ఆమె నాకు థ్యాంక్స్ చెప్పాలి. సినిమాల్లో రేప్ సన్నివేశాల్లో నటిస్తున్నారంటే నిజంగానే రేప్ చేస్తున్నారా? హత్య చేసే సన్నివేశాలు ఉంటే నిజంగానే హత్యలు చేస్తున్నారా? ఈ విషయంలో నడిగర్ సంఘం చాలా పెద్ద తప్పు చేసింది. ఏం జరిగిందో తెలుసుకోలేదు. నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం ఫోనులో కూడా ఎవ్వరూ వివరణ కోరలేదు. అందుకే నడిగర్ సంఘానికి నేనే డెడ్‌లైన్ విధిస్తున్నాను. బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ నడిగర్ సంఘం జారీ చేసిన పత్రికా ప్రకటనను ఉపసంహరించు కోవాలి. సంఘం నియమ నిబంధనల ప్రకారం నాకు నోటీసు పంపిస్తే దానికి వివరణ ఇస్తాను. ప్రజలు నావైపు ఉన్నారు. నేను ఎవరినీ క్షమాపణలు కోరే ప్రసక్తే లేదు. నన్ను రెచ్చగొడితే అగ్నిగోళంలా బద్దలవుతా. అదే జరిగితే చుట్టుపక్కల ఉన్నవారంతా పారిపోతారు’ అంటూ మన్సూర్ అలీఖాన్ హెచ్చరించారు. ఇప్పుడు మన్సూర్ దిగొచ్చి త్రిషకు స్వారీ చెప్పి ఈ సమస్యకు తెరదించారు.