Kamakshi Bhaskarla: ‘పొలిమేర’ పోరి పిచ్చెక్కించేసిందిగా.

ABN, Publish Date - Jan 07 , 2025 | 08:37 PM

Kamakshi Bhaskarla: ‘పొలిమేర’ పోరి పిచ్చెక్కించేసిందిగా. 1/6

కామాక్షి భాస్కర్ల.. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో బాగా వినిపిస్తున్న పేరు. ఒక వైపు హీరోయిన్‌గా నటిస్తూనే మరో వైపు.. తనకు వచ్చిన ఇతర అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకుంటుందీ భామ.

Kamakshi Bhaskarla: ‘పొలిమేర’ పోరి పిచ్చెక్కించేసిందిగా. 2/6

ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీబిజీగా ఉన్న కామాక్షి భాస్కర్ల.. ఇటీవల వచ్చిన ‘మా ఊరి పోలిమేర 2’ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఆమె.. మరో వైపు ‘రౌడీ బాయ్స్’, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’, ‘విరూపాక్ష’ వంటి సినిమాలలో చిన్న పాత్రలో కనిపించింది.

Kamakshi Bhaskarla: ‘పొలిమేర’ పోరి పిచ్చెక్కించేసిందిగా. 3/6

సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ చేస్తూ.. తన నటనా పటిమను చాటుకుంటోంది. ఝాన్సీ, దూత వంటి వెబ్ సిరీస్‌లలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో తనకంటూ ఓ గుర్తింపును కామాక్షి భాస్కర్ల సంపాదించుకోగలిగింది.

Kamakshi Bhaskarla: ‘పొలిమేర’ పోరి పిచ్చెక్కించేసిందిగా. 4/6

కామాక్షి భాస్కర్ల‌లో ఉన్న మరో విశేషం ఏమిటంటే.. ఏ పాత్రలోనైనా ఒదిగిపోవడం. గ్లామర్‌గానూ నటించగలదు. డీ గ్లామర్‌గానూ రక్తి కట్టించగలదు. అలాంటి నైపుణ్యం కొందరి హీరోయిన్లలో మాత్రమే ఉంటుంది. అది కామాక్షి భాస్కర్లలో కూడా ఉంది.

Kamakshi Bhaskarla: ‘పొలిమేర’ పోరి పిచ్చెక్కించేసిందిగా. 5/6

తాజాగా ఆమె ఓ గ్లామర్ ఫొటోషూట్ నిర్వహించింది. ఈ ఫొటోలలో ఆమె మరింత అందంగా కనిపిస్తోంది. ఇంతకు ముందు ఇలా ఆమె కనిపించిందే లేదు. అంతగా గ్లామర్‌తో కట్టిపడేసింది.

Kamakshi Bhaskarla: ‘పొలిమేర’ పోరి పిచ్చెక్కించేసిందిగా. 6/6

ఈ న్యాచురల్ అందాన్ని చూసేందుకు కుర్రకారు ఎగబడుతుండటంతో.. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. త్వరలోనే ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘పొలిమేర 3’తో ఈ భామ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated at - Jan 07 , 2025 | 09:30 PM