Hit 3 Trailer: రాజమౌళి రికార్డ్ ఫట్... చేసింది నాని 'హిట్'...
ABN , Publish Date - Apr 15 , 2025 | 07:17 PM
'హిట్ 3' ట్రైలర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. నాని భీకర వైలెన్స్ ను మూవీ లవర్స్ తెగ చూసేస్తున్నారు. జస్ట్ ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) శైలేశ్ కొలను (Sailesh Kolanu) కాంబోలో వస్తున్న హిట్ 3 (HIT 3 ) రిలీజ్ కు ముందే వండర్స్ క్రియేట్ చేస్తోంది. హిట్ సిరీస్‌లో భాగం వస్తున్న ఈ మూవీపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. నాని పవర్ ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. మే 1న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేస్తున్న కంటెంట్ అంచనాలను భారీగా పెంచేశాయి. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్.... సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. రాజమౌళి రికార్డులను బ్రేక్ చేసే దిశగా దూసుకోవడం సెన్సేషన్ గా మారింది.
ఫుల్ వైలెన్స్‌తో నిండిపోయిన ట్రైలర్ ను మూవీ లవర్స్ తెగ చూసేస్తున్నారు. ఇంటెన్సిటీ, రక్తపాతం, స్టైలిష్ యాక్షన్‍తో కట్ చేసిన మెప్పిస్తుంది. దీంతో ఈ ట్రైలర్ రిలీజైన 24 గంటల్లోనే 23.1 మిలియన్లకి పైగా వ్యూస్తో యూట్యూబ్లో ట్రెండింగ్‌లో నిలిచింది. అంతేకాక గత బ్లాక్ బస్టర్ సినిమాల రికార్డులను దాటేయడం సెన్సేషన్ గా మారుతోంది. రాజమౌళి (Rajamouli ) తెరకెక్కించిన ట్రిపులార్ (RRR) ట్రైలర్ 20.45 మిలియన్లు దాటేసింది. హిట్ 3 ట్రైలర్‌కి ఏకంగా 23.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అయితే ఇప్పటి వరకు 24 గంటల్లో హయ్యెస్ట్ వ్యూస్ తెచ్చుకున్న పుష్ప 2 ట్రైలర్ 44.67 మిలియన్లు ముందంజలో ఉంది.
ఫ్యామిలీ హీరోగా పక్కింటి కుర్రాడిగా కనిపించిన నాని హిట్ 3లో మోస్ట్ వయలెంట్ కాప్‌గా కనిపించనున్నాడు.అర్జున్ సర్కార్ గా గతంలో ఎప్పుడు లేనంత వైలెంట్ క్యారెక్టర్ చేశారు. దీంతో జస్ట్ ట్రైలర్ తోనే బిజినెస్, బుకింగ్‌లు నెవర్ బిఫోర్ అనేలా జరిగేలా కనిపించనున్నాయి. భారీ బడ్జెట్ తో బరిలో దిగుతున్న ఈ మూవీ... రిలీజ్ తర్వాత మరెన్ని సంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి