Vishwambhara: రామ రామ సాంగ్ కు ఆరు కోట్లా
ABN , Publish Date - Apr 15 , 2025 | 03:10 PM
విశ్వంభర నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ విజువల్ ట్రీట్ గా అనిపించింది.అయితే ఈ పాట కోసం భారీ గా ఖర్చు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీల్లో ఇప్పుడు విశ్వంభర (Vishwambhara ) ఒకటి. లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ట (Vassishta ) కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా సోషియో ఫాంటసీ చిత్రం కావడంతో మరింత ఆసక్తి పెరిగింది. బడ్జెట్ విషయంలో కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ విషయం రీసెంట్ గా రిలీజైన రామ రామ పాటను చూస్తేఅర్థమవుతోంది. ఈ పాట కోసం ఖర్చు పెట్టిన తీరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
హనుమాన్ జయంతి సందర్భంగా రామ రామ అంటూ సాగే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. క్యాచీ వర్డ్స్ తో పాటు విజువల్ ట్రీట్ గా అనిపించింది ఈ పాట. అయితే ఈ పాట కోసం పెట్టిన ఖర్చు గురించి ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ సాగుతోంది. ఈ ఒక్క పాట కోసం దాదాపు ఆరు కోట్లు ఖర్చు పెట్టారట. రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry) అద్భుతమైన పదాలతో రాసిన ఈ పాటకు అంతే మధురమైన సంగీతాన్ని అందించారు కీరవాణి ( Keeravani). పాట కలర్ ఫుల్ గా కనిపించడంతో పాటు... గ్రాండియర్ లుక్ ను తీసుకువచ్చింది. ఆ పాట గురించి మరో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షాక్ కు గురి చేస్తున్నాయి.
రామ రామ అంటూ సాగే పాటను దాదాపు 12 రోజుల పాటు షూట్ చేసినట్లు టాక్. 400 మంది డాన్సర్లు, 400 మంది జూనియర్లు, 15 మంది నటీనటులతో ఈ పాటను అద్భుతంగా తెరకెక్కించారు. 4 భారీ సెట్స్‌లో సాంగ్ ను షూట్ చేశారట. ఈ పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని.... మేకింగ్ క్వాలిటీ కూడా అదిరిపోయిందని పాటను విన్న మూవీ లవర్స్ చర్చించుకుంటున్నారు. త్వరలోనే మరో సాంగ్ ను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
జూన్ 24న మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్న మేకర్స్... మే నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టాలనుకుంటున్నారట. ఒక్క పాట మినహా ఆల్ మోస్ట్ సినిమా చివరి దశకు వచ్చేసింది.త్వరలోనే చిరుతో ఆ మాస్ సాంగ్ ను చిత్రీకరించనున్నారట. మెగాస్టార్ తో ఊరమాస్ స్టెప్పులు వేయడానికి ఓ స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేసినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే చిరుకి జోడిగా త్రిష నటిస్తోంది. కీ రోల్స్ తో మరికొంత మంది ముద్దుగుమ్మల పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ లో గ్రాఫిక్స్ పై విమర్శలు రావడంతో మేకర్స్ స్పెషల్ ఫోకస్ పెట్టారట. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా... విజువల్ వండర్ గా సినిమాను తీయాలనుకుంటున్నారట. అందుకే గ్రాఫిక్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. మొత్తానికి విజువల్ ట్రీట్ గా రాబోతున్న ఈ మూవీ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.