Devara: వార్స్ వద్దు.. ‘దేవర’ అభిమానులకు నిర్మాత నాగవంశీ రిక్వెస్ట్

ABN, Publish Date - Sep 25 , 2024 | 03:31 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ ఆగమనానికి ఇంకొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. దాదాపు 6 సంవత్సరాలు తర్వాత తారక్ నుంచి వస్తోన్న సోలో సినిమా కావడంతో.. సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఏపీలో విడుదల చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత నాగవంశీ అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. అదేంటంటే..

Devara Movie Still

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ (Young Tiger NTR Devara Movie) ఆగమనానికి ఇంకొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. దాదాపు 6 సంవత్సరాలు తర్వాత తారక్ నుంచి వస్తోన్న సోలో సినిమా కావడంతో.. సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను విడుదల చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత నాగవంశీ.. అభిమానులకు ట్విట్టర్ ఎక్స్ వేదికగా కొన్ని సూచనలు చేశారు. తారక్ అన్నకు మరపురాని హిట్‌ని అందిద్దాం అంటూ ఆయన చేసిన పోస్ట్‌ ప్రస్తుతం వైరల్ అవుతంది. నాగవంశీ (Naga Vamsi) పోస్ట్‌లో ఏం చెప్పారంటే..

Also Read-Pawan Kalyan: హీరో కార్తీ క్షమాపణలపై పవన్ కళ్యాణ్ స్పందనిదే..

‘‘ఎన్టీఆర్ చాలాకాలం తర్వాత ఎమోషనల్ మాస్ కంటెంట్ ఉన్న సినిమా ‘దేవర’తో వస్తున్నారు. ప్రేక్షకులకు మంచి కంటెంట్ ఇవ్వడానికి తన వంతు బాధ్యతని తారక్ పూర్తి చేశాడు. అలాగే మేము కూడా ప్రభుత్వం సహాయంతో, చాలా కాలం తర్వాత APలో బెనిఫిట్ షోలతో పాటు సినిమాను విస్తృతంగా విడుదల చేయడానికి చేయగలిగినదంతా చేశాము. ఈ సందర్భంగా అభిమానులకు, ప్రేక్షకులకు చిన్న విజ్ఞప్తి. అభిమానులు కూడా బాధ్యతగా తీసుకుని ప్రశాంతంగా ఉండి, ఎలాంటి ఫ్యాన్ వార్స్‌కు పాల్పడవద్దని కోరుతున్నాము. ఫ్యాన్ వార్స్ వల్ల మన సినిమాపై మనమే నెగిటివిటీని ఆహ్వానించినవాళ్లం అవుతాం. ఇది తాత్కాలిక ఆనందం ఇవ్వవచ్చేమో కానీ.. ఆ తర్వాత మన హీరోల చిత్రాలపై ప్రభావం చూపిస్తుందని గమనించగలరు. అందుకే ఫ్యాన్స్ అందరూ వార్స్‌కి స్వస్తి పలికి.. థియేటర్లలోకి వస్తోన్న ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాను. సోషల్ మీడియా వేదికగా జరిగే ఫ్యాన్ వార్స్‌కు ముగింపు పలికే సినిమాగా ‘దేవర’ ఉండాలని ప్రతిజ్ఞ చేద్దాం. (Naga Vamsi Post on Devara)


అలాగే ఈ సినిమా ఫస్ట్ షో చూసే వారు ఎవరైనా సరే.. సామాజిక మాధ్యమాలలో వీడియోలు షేర్ చేయవద్దు. అలాగే అభిమానులు కూడా మీ పక్కన ఉన్నవారు వీడియో తీయకుండా చూసి, మీ తర్వాత సినిమా చూసే వారికి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించండి. ఎంతో ప్రేమతో, శ్రద్ధతో తారక్ అన్నకు మరపురాని బ్లాక్‌బస్టర్‌ని అందిద్దాం. దేవర సెప్పిండు అంటే సేసినట్టే..’’ అని నిర్మాత నాగవంశీ తన సుధీర్ఘ పోస్ట్‌లో పేర్కొన్నారు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ‌సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె సినిమాను అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయమవుతోన్న ఈ చిత్రంలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించారు.

Also Read- Pawan Vs Prakash Raj: పవన్‌కల్యాణ్‌కు ప్రకాశ్‌రాజ్‌ కౌంటర్‌

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 25 , 2024 | 03:31 PM