Devara Event: దేవర ఈవెంట్ రద్దు.. నిర్వాహకుల క్షమాపణ
ABN , Publish Date - Sep 23 , 2024 | 04:09 PM
ఎన్టీఆర్ (NTR) హీరోగా కొరటాల శివ (Koratala siva) తెరకెక్కించిన 'దేవర’ (Devara) చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో జరగాల్సి ఉంది.
ఎన్టీఆర్ (NTR) హీరోగా కొరటాల శివ (Koratala siva) తెరకెక్కించిన 'దేవర’ (Devara) చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో జరగాల్సి ఉంది. వేడుకను ఘనంగా నిర్వహించడానికి మేకర్స్ అన్ని రకాల ప్లాన్ చేశారు. అయితే కెపాసిటీని మించి అభిమానులు, ఆడియన్స్ ఈ ఈవెంట్‌కు హాజరు కావడంతో పరిస్థితి ఉద్రిగ్తత నెలకొంది. తోపులాటలో హోటల్‌లో అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు కంట్రోల్‌లోకి తీసుకుని చక్కబరిచే ప్రయత్నం చేయగా విఫలమైంది. దీంతో ఈవెంట్‌నే రద్దు చేశారు. అభిమానులు ఆగ్రహానికి లోనయ్యారు. దీనిపై నిర్వాహకులు స్పందించారు. ఈ మేరకు అభిమానులకు క్షమాపణ (Organizers apology) చెప్పారు.
"ఎన్టీఆర్ పట్ల మీ అందరికీ ఉన్న అపారమైన ఉత్సాహం, ప్రేమను మేము అర్థం చేసుకున్నాము. ఆరు సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ నటించిన సోలో సినిమా రావడంతో అభిమానుల్లో మరింత క్రేజ్ పెరిగింది. దాంతో అభిమానులు దేవర ఈవెంట్‌కు విపరీతంగా హాజరయ్యారు. కానీ ఈవెంట్ రద్దు కావడంతో అభిమానుల్లో చాలామంది ఎంతగా నిరుత్సాహానికి లోనవుతున్నారో తెలిసి మా హృదయం బరువెక్కింది. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ ఈవెంట్ అభిమానులకు ఎంత ప్రత్యేకమో తెలుసుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బహిరంగ వేదికలను ఏర్పాటు చేయాలని మొదట్లో ప్రయత్నించాం. అయితే, రెండు ప్రధాన కారణాల వల్ల పెద్ద ఎత్తున బహిరంగ కార్యక్రమాలకు పోలీసు అనుమతులు మంజూరు కాలేదు. అందుకు గణేష్ నిమజ్జనంతో సమయం దొరకలేదు. వర్షాలు వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో ఈవెంట్‌ను ఆరుబయట నిర్వహించడం సురక్షితం కాదన్నది రెండో కారణం. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, మేము బహిరంగ వేదికల కోసం అనుమతులు పొందేందుకు అన్ని ప్రయత్నాలు చేశాము. కానీ దురదృష్టవశాత్తు పర్మిషన్ దక్కించుకోలేకపోయాం.
ఫలితంగా మేము 5500 మంది వ్యక్తులతో నోవాటెల్ హాల్ 3 నుంచి హాల్ 6 వరకు బుక్ చేశాము. 4000 మందికి పోలీసులు అనుమతి పొందాము. మేము ఈ పరిమితిని కచ్చితంగా పాటించాము, అతిథుల సంఖ్య అనుమతించబడిన దానికంటే మించకుండా ఉండేలా చూసుకున్నాము. పాస్ లేని వారికి ఎంట్రీ ఇవ్వలేదు. ఎంట్రీ పాస్‌ల విషయంలో కూడా కట్టుదిట్టంగా ఉన్నాం. అదనపు పాస్‌లు పంపిణీ చేయబడుతున్నాయనే వార్తలు పూర్తిగా అబద్థం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ 30,000 నుంచి 35,000 మంది ప్రేక్షకులు తారక్‌ను కలవాలనే కోరికగా పరిమితులను లెక్క చేయకుండా ఆడిటోరియంకు చేరుకున్నారు. దీంతో అక్కడి వాతావరణం వేడెక్కిపోయింది. పోలీసులు సైతం పరిస్థితిని కంట్రోల్ చేయలేని స్థితిలో ఈవెంట్‌ను క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా చేయడానికి వంద యూట్యూబ్ ఛానళ్లకు లైవ్ స్ర్టీమింగ్‌ను కూడా ఏర్పాటు చేశాము. అయితే కంట్రోల్ దాటిని అక్కడ పరిస్థితి చక్కబరచడానికి, ప్రేక్షకుల భద్రత కోసమే ఈవెంట్‌ను రద్దు చేశాం’’ అని నిర్వాహకులు తెలిపారు.
శ్రేయాస్ మీడియా అత్యుత్సాహం.. (Shreyas media)
మరోపక్క దేవర ఈవెంట్‌కు పాసులు పంచడంలో శ్రేయాస్ మీడియా ప్రదర్శించిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. విపరీతంగా క్రౌడ్‌ను సృష్టించడానికి కెపాసిటీని మించి పాస్‌లు డిస్ట్రిబ్యూట్ చేసిందట శ్రేయాస్ మీడియా సంస్థ. పరిమితి మించి పాస్‌లు అభిమానుల చేతిలో ఉండడంతో ఆడిటోరియం బయట ఉన్న ఆడియన్స్ అంతా ఒక్కసారిగా లోపలికి దూసుకుపోవడంతో హోటల్ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. ఒక్కసారిగా గేట్లు తెరుచుకుని బారిగేట్లు తొలగించి అభిమానులు లోపలికి దూసుకెళ్లగా కొందరికి గాయాలు అయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. హాల్ కెపాసిటీని మించి శ్రేయాస్ మీడియా సంస్థ పాస్‌లు పంచడమే దీనికి కారణమని, వారిపై కేసు నమోదు చేయాలని అభిమానులు డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా శ్రేయాస్ మీడియా వైఫల్యమే అని అభిమానులు మండిపడుతున్నారు.