Devara Fear Song: అగ్గంటుకుంది సంద్రం.. భగ్గున మండే ఆకశం’

ABN , Publish Date - May 19 , 2024 | 07:17 PM

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'దేవర’. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతం నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోన్న చిత్రమిది.

Devara Fear Song: అగ్గంటుకుంది సంద్రం.. భగ్గున మండే ఆకశం’


ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'దేవర’. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతం నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోన్న చిత్రమిది. అక్కడ ఉండే భయం తెలియని మృగాళ్లకు భయాన్ని పరిచయం చేసే శక్తిమంతమైన పాత్రలో తారక్‌ కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి వచ్చిన ప్రతి అప్‌డేట్‌ సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తూ, అంచనాలు పెంచుతోంది. సోమవారం తారక్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం అభిమానులకు ట్రీట్‌ ఇవ్వనుంది. ఈ చిత్రం నుంచి ఫియర్‌ సాంగ్‌ను ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసింది. 'ఆ గట్టునుంది సంద్రం, భగ్గున మండే ఆకశం’ అంటూ సాగే ఫియర్‌ సాంగ్‌ కూడా విపరీతంగా వైరల్‌ అవుతూ ఇంటర్‌నెట్‌ను షేక్‌ చేస్తోంది.

జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్‌, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. మొదటి పార్ట్‌ను అక్టోబర్‌ 14న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - May 19 , 2024 | 09:20 PM