Niharika Konidela: దయచేసి కళ్యాణ్ బాబాయ్ గురించి అలాంటి ప్రశ్నలు అడగకండి..

ABN, Publish Date - Jul 21 , 2024 | 07:29 PM

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం ఆగ‌స్ట్ 9న విడుద‌లయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిహారిక ఓ చిట్ చాట్‌లో పాల్గొంది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన అనేక ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు.

AP Deputy CM Pawan Kalyan and Niharika

మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ (Pink Elephant Pictures) ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu). ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలు. గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్‌, ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగ‌స్ట్ 9న విడుద‌లయ్యేందుకు ముస్తాబవుతోంది. మేకర్స్ ఈ చిత్ర ప్రమోషన్స్‌ని యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్స్‌లో స్వయంగా నిహారిక కూడా పాల్గొంటూ.. సినిమాపై హైప్ పెంచుతోంది. తాజాగా ఆమె ఓ చిట్ చాట్‌లో పాల్గొంది. ఈ కార్యక్రమంలో ఆమెకు ఎక్కువగా పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)కు సంబంధించిన ప్రశ్నలే ఎదురయ్యాయి.

Also Read- Kirak RP: జగన్ మానసికస్థితిపై ఎర్రగడ్డ‌లో టెస్ట్ చేయాలి.. విజయసాయి రెడ్డి దుర్మార్గుడు!!

సినిమాల నుంచి పాలిటిక్స్ వరకు పవన్ కళ్యాణ్ ప్రస్థానం గురించి ఆమె మాట్లాడుతూ.. ఆయన ఎప్పటికీ అందరికీ పవర్ స్టారే. ఇప్పుడు డిప్యూటీ సీఏం (AP Deputy CM Pawan Kalyan), మంత్రి అయ్యారు. ఆయనని దగ్గర నుంచి చూసిన వారిగా మాకు ఎంతో ఆనందంగా ఉంది. బాబాయ్ డిప్యూటీ సీఎం అయ్యారనే గర్వం కంటే కూడా.. ఆయన తన పార్టీ కోసం, ప్రజల కోసం పడిన కష్టానికి తగిన ఫలితం ఇన్నాళ్లకు దక్కిందనే సంతోషం మాకు ఎక్కువ ఆనందాన్నిచ్చింది. కళ్యాణ్ బాబాయ్ గెలిచారని తెలియగానే మా అమ్మ ఎంతో ఎమోషనల్ అయ్యింది. ఎందుకంటే, అమ్మ కూడా ప్రచారానికి వెళ్లి.. పరిస్థితులను దగ్గర నుంచి చూసింది. ఆమె అనుకున్న విజయం వరించడంతో అమ్మ ఎంతో ఆనందం అదే సమయంలో భావోద్వేగానికి లోనైంది. (Chit Chat with Niharika Konidela)


పవన్ కళ్యాణ్ సినిమాలు చేయాలని అనుకుంటున్నారా? లేక రాజకీయంగా ఇంకా ఉన్నత స్థానానికి వెళ్లాలని అనుకుంటున్నారా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. సినిమాల పరంగా ఎలాగో.. పొలిటికల్‌గానూ ఆయన సూపర్‌స్టారే. నేనయితే కళ్యాణ్ బాబాయ్‌ని పొలిటికల్ లీడర్‌ (Political Leader)‌గానే ఇష్టపడతా. ఆయన స్పీచ్‌లు ఇచ్చేటప్పుడు.. చాలా సార్లు అక్కడ ఉంటే బాగుండేదే అని అనిపించింది. ఆ స్పీచ్‌లు నన్ను ఎంతగానో మోటివేట్ చేశాయి.

మీ బాబాయ్ మీపై ఎప్పుడైనా కోపగించుకున్నారా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. బాబాయ్ ఎప్పుడూ నాపై కోప్పడలేదు. నేను నిహా అని పిలుస్తారు. ప్లీజ్.. ఇలాంటి ప్రశ్నలు మళ్లీ మళ్లీ అడగకండి అని నిహారిక చెప్పుకొచ్చారు. పెదనాన్న, నాన్న, బాబాయ్.. ఈ ముగ్గురిలో ఒక కామన్ థింగ్ చెప్పమంటే.. ‘వారి కళ్లు’ (Eyes) అని తెలిపింది నిహారిక.

Read Latest Cinema News

Updated Date - Jul 21 , 2024 | 07:29 PM