Committee Kurrollu: ‘ఆ రోజులు మళ్లీ రావు’.. సాంగ్ రిలీజ్‌! నిజంగా నాటి రోజుల్లోకి తీసుకెళ్లిందిగా

ABN , Publish Date - Jun 02 , 2024 | 06:47 PM

మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం నుంచి ఇప్పటికే వదిలిన పాట, పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ‘ఆ రోజులు మళ్లీ రావు’ అంటూ సాగే ఓ ఫీల్ గుడ్ పాటను రిలీజ్ చేయ‌గా పాట నిజంగా నాటి రోజుల్లోకి తీసుకెళ్లేదిగా ఉంది.

Committee Kurrollu: ‘ఆ రోజులు మళ్లీ రావు’.. సాంగ్ రిలీజ్‌! నిజంగా నాటి రోజుల్లోకి తీసుకెళ్లిందిగా
Committee Kurrollu

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధ దామోదర్ స్టూడియో బ్యానర్లపై (Pink Elephant Pictures and Shree Radha Damodar Studios) నిహారిక కొణిదెల (Niharika) సమర్పణలో‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu) అనే చిత్రాన్ని పద్మజ కొణిదెల, జయలక్ష్మీ అడపాక నిర్మించారు. ఎద వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాద్ వర్మ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.

GPC8gevbQAAAlKh.jpeg

ఈ చిత్రం నుంచి ఇప్పటికే వదిలిన పాట, పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఓ ఫీల్ గుడ్ పాటను రిలీజ్ చేశారు. నాటి రోజుల్లోకి తీసుకెళ్లేలా ఉన్న ‘ఆ రోజులు మళ్లీ రావు’ (Aa Rojulu Malli Raavu)అనే ఈ పాటను సింగర్ కార్తిక్ (Karthik) ఆలపించారు.


GO-gWqGWkAAh0b6.jpeg

కృష్ణ కాంత్ రాసిన ఈ పాట మన మూలాల్ని గుర్తు చేసేలా ఉన్నాయి. అనుదీప్ దేవ్ (Anudeep Dev) బాణీ ఎంతో క్యాచీగా,వినసొంపుగా, హాయిగా ఉంది. ఈ లిరికల్ వీడియోని చూస్తే మళ్లీ మన ఊర్లోకి వెళ్లాలని అనిపించేలా ఉంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

Updated Date - Jun 02 , 2024 | 06:48 PM