Devara: విడుదలకు సిద్ధమైన వేళ ‘దేవర’కు ఏపీలో మరో షాక్

ABN, Publish Date - Sep 26 , 2024 | 02:28 PM

‘దేవర’కు ఏపీలో మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఏపీ ఉన్నత న్యాయస్థానం ‘దేవర’ టీమ్‌‌కు షాక్ ఇవ్వగా.. ఇప్పుడు మరో షాక్ ఏపీలో ‘దేవర’కు ఎదురైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి దాదాపు ఆరేళ్ల సుధీర్ఘ గ్యాప్ తర్వాత వస్తున్న సోలో సినిమాకు ఇలా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇంతకీ ‘దేవర’కు ఇప్పుడొచ్చిన చిక్కు ఏంటంటే..

Devara Movie Still

‘దేవర’ (Devara)కు ఏపీలో మరో షాక్ తగిలింది. ఇప్పటికే 14 రోజుల పాటు టికెట్స్ ధరలని పెంచుకోవచ్చు అన్న ప్రభుత్వ ఆదేశాలను సవరిస్తూ.. 10 రోజులకు కుదిస్తూ ఏపీ ఉన్నత న్యాయస్థానం ‘దేవర’ టీమ్‌కు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏపీలో ‘దేవర’ సినిమాకు మరో చిక్కు ఎదురైంది. అదేంటంటే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘దేవర’ మద్దతు ఇవ్వాలని జన జాగరణ సమితి వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. ‘దేవర’ సినిమా పోస్టర్లపై ‘సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్’ నినాదాల పోస్టర్లను జన జాగరణ సమితి నేతలు అతికించారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మద్దతు ఇవ్వాలని జన జాగరణ సమితి విజ్ఞప్తి చేసింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌ ‘దేవర’ సినిమాకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం సెగ తాకింది.

Also Read- Prakash Raj Vs Pawan: పవన్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్‌


విశాఖపట్నంలో చాలా చోట్ల ‘దేవర’ సినిమా పోస్టర్లపై ‘సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అనే నినాదాలతో ఉన్న పోస్టర్లు వెలిశాయి. మరి ఈ పోస్టర్ల వ్యవహారంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తాడా? విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఇస్తాడా? లేదా? అనేది వేచి చూడాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులు, సినీ ప్రియులను అలరించేందుకు ఎన్టీఆర్ ‘దేవర’తో సిద్ధమయ్యారు. యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా రికార్డు స్థాయిలో ప్రీ సేల్స్ రాబట్టి అంచనాలను అమాంతం పెంచేసింది. ఎన్టీఆర్ నుంచి దాదాపు ఆరేళ్ల సుధీర్ఘ గ్యాప్ తర్వాత వస్తున్న సోలో సినిమా ఇదే కావడంతో అభిమానులు కూడా ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నారు.


కానీ ‘దేవర’కు ఏదో ఒక చోట ఆటంకం కలుగుతూనే ఉంది. టికెట్ల ధరలో పెంపు విషయంలో ఏపీ ఉన్నత న్యాయస్థానం అలా తీర్పు ఇస్తే.. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ సెగ. మొన్నీ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. ఇలా ‘దేవర’కు అడుగడుగునా ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. మరి ఇన్ని ఆటంకాల నడుమ ‘దేవర’ థియేటర్లలో ఎలాంటి సక్సెస్‌ను రాబడతాడనేది ఇంకొన్ని గంటల్లో తెలిసిపోనుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ‌సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె నిర్మించారు. రెండు పార్ట్‌లుగా రూపొందుతోన్న ఈ చిత్ర మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Also Read- Harsha Sai: అసలెవరీ హర్షసాయి.. మరో మెగాస్టార్ అంటూ బిల్డప్ ఇచ్చిన వారంతా ఏమయ్యారు


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 26 , 2024 | 05:13 PM