Nindha: ‘నింద’ చూశాక.. ప్రతి ఒక్కరూ అలా అనుకుంటారు..

ABN, Publish Date - Jun 19 , 2024 | 03:01 PM

వరుణ్ సందేశ్ హీరోగా ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘నింద’. రాజేష్ జగన్నాధం నిర్మిస్తూ, దర్వకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 21న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా దర్శక నిర్మాత రాజేష్ జగన్నాథం ఈ చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేశారు.

Nindha Director Rajesh Jagannadham

వరుణ్ సందేశ్ (Varun Sandesh) హీరోగా ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘నింద’ (Nindha). రాజేష్ జగన్నాధం (Rajesh Jagannadham) నిర్మిస్తూ, దర్వకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 21న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా దర్శక నిర్మాత రాజేష్ జగన్నాథం ఈ చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేశారు.

మీ నేపథ్యం, సినీ ప్రయాణం గురించి..?

మాది నర్సాపురం. చదువుల కోసం నెల్లూరు, చెన్నై, యూఎస్‌ అంటూ తిరిగాను. యూఎస్‌లోనే ఉద్యోగం చేస్తూ ఉండిపోయాను. ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. యూఎస్‌లో ఫిల్మ్ మేకింగ్‌లో కోర్సులు కూడా చేశాను. చిన్న చిన్నగా అక్కడే షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఓ షార్ట్ ఫిల్మ్‌కి అవార్డు కూడా వచ్చింది. (Nindha Director Rajesh Jagannadham)

ఈ సినిమా కథను వరుణ్ సందేశ్‌కే ఎందుకు చెప్పారు?

వరుణ్ సందేశ్‌కి ఈ పాత్ర బాగా సెట్ అవుతుందని నమ్మాను. ఆయనకు ఇది మంచి కమ్ బ్యాక్‌లా ఉంటుందని భావించాను. అందుకే ఆయనకు కథ చెప్పాను. వరుణ్ సందేశ్‌కి కథ బాగా నచ్చింది.. ఆ తర్వాత అంతా ముందుకు తీసుకెళ్లాం.

యదార్థ సంఘటనల అంటున్నారు కదా.. ఇందులో ఎంత వరకు నిజాలుంటాయి? ఎంత వరకు కల్పితం ఉంటుంది?

కాండ్రకోట మిస్టరీ అని ‘నింద’ పోస్టర్ వదిలినప్పుడు అందరూ ఘోస్ట్ మీద సినిమా అని రాశారు. సర్లే ఏదో ఒకటి రాశారు.. ప్రమోషన్ కల్పిస్తున్నారని అనుకున్నాను. టీజర్ రావడంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. ఈ చిత్రంలో రియల్ ఇన్సిడెంట్స్‌ను బేస్ చేసుకుని కొన్ని సీన్లు రాసుకున్నాను. కల్పితం కూడా కొంత మేర ఉంటుంది.

దర్శకత్వం ఓకే.. మరి నిర్మించాలనుకోవడానికి కారణం?

‘నింద’ కథపై నాకు నమ్మకం ఉంది. నిర్మాతల కోసం ప్రయత్నించాను. వేరే వాళ్లు ఎందుకు? నా సినిమాను నేను నిర్మించాలని ఆ తర్వాత అనిపించింది. అందుకే నిర్మాతగానూ మారాను. ప్రతీ రోజూ సెట్స్ మీద మా నాన్నగారు కూడా ఉండేవారు. చిన్న చిన్న ఖర్చులని ఆయన మ్యానేజ్ చేసేవారు.


దర్శకత్వం, నిర్మాణం.. ఏది సులభం అనిపించింది?

నాకు క్రియేటివ్ ఫీల్డ్ అంటేనే ఇష్టం. దర్శకుడిగానే నాకు నచ్చింది. నాకు సినిమాలు తీయడమే ఇష్టం. సినిమాను తీయడం కంటే రిలీజ్ చేయడం చాలా కష్టమని ఇప్పుడర్థమవుతోంది. (Director Rajesh Jagannadham Interview)

‘నింద’ టెక్నికల్ టీం గురించి..?

పీఎస్ వినోద్‌గారి వద్ద అసిస్టెంట్‌గా పని చేసిన రమిజ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా పని చేశారు. విశాల్ చంద్రశేఖర్ వద్ద పని చేసిన సాంతు ఓంకార్ మంచి ఆర్ఆర్, మ్యూజిక్‌ను ఇచ్చారు. ఈ చిత్రానికి టెక్నికల్ టీం మేజర్ అస్సెట్‌గా ఉంటుంది. టెక్నికల్‌గా హై స్టాండర్డ్‌లో ఈ చిత్రం ఉంటుంది.

ఆర్టిస్టులతో చేసిన ప్రయాణం గురించి చెప్పండి?

‘నింద’లో ప్రతీ పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. వరుణ్ సందేశ్ చాలా కొత్తగా కనిపిస్తారు. మైమ్ మధు, అన్నీ ఇలా ప్రతీ పాత్రతో ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. ఈ సినిమాకు మంచి టీం కుదిరింది. మంచి టీం దొరికితే పెర్ఫార్మెన్స్‌లు కూడా బాగా వస్తాయి కదా. (Ninda Movie)

అసలీ సినిమా ఎలా ఉండబోతోంది?

మలయాళం సినిమాలు చూసి.. ఇలాంటి చిత్రాలు మన వద్ద ఎందుకు రావని అంతా అనుకుంటారు. కానీ ‘నింద’ చూశాక.. మన వద్ద కూడా మంచి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు వస్తున్నాయి.. ఇదేదో బాగానే ఉందే.. బాగా తీశారే అని అనుకునేలా ఉంటుంది. అందరికీ నచ్చే చిత్రమవుతుంది.

నెక్ట్స్ ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయా?

నా దగ్గర బౌండెడ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యాక, దాని రిజల్ట్ చూసి నెక్ట్స్ సినిమాలను ప్రకటిస్తాను. ఇకపై ఎక్కువగా సినిమా దర్శకత్వంపైనే ఫోకస్ పెడతాను.

Read Latest Cinema News

Updated Date - Jun 19 , 2024 | 03:01 PM