Nindha: గానామాస్ స్పెషల్ స్కూల్ కిడ్స్ వదిలిన ‘సంకెళ్లు’ పాట..

ABN , Publish Date - May 25 , 2024 | 04:51 PM

వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘నింద’. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతోంది. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, టీజర్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ సినిమాలోని ‘సంకెళ్లు’ అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ వదిలారు.

Nindha: గానామాస్ స్పెషల్ స్కూల్ కిడ్స్ వదిలిన ‘సంకెళ్లు’ పాట..
Nindha Song Launch Event

చాలా గ్యాప్ తర్వాత హీరో వరుణ్ సందేశ్ (Vaun Sandesh) చేస్తున్న చిత్రం ‘నింద’ (Nindha). ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం (Rajesh Jagannadham) దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతోంది. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, టీజర్ మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌ని మేకర్స్ స్టార్ట్ చేశారు. గానామాస్ స్పెషల్ స్కూల్‌కి (Ganamas Foundations) చెందిన పిల్లలు ఈ సినిమాలోని ‘సంకెళ్లు’ (Sankellu Lyrical Song) అంటూ సాగే పాటను విడుదల చేశారు.

*Rao Ramesh: బర్త్‌డే స్పెషల్‌.. ‘పుష్ప 2’ సిండికేట్ సిద్ధప్ప లుక్ విడుదల


Nindha-Song-Launch.jpg

ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ రాసిన సాహిత్యం, సంతు ఓంకార్ ఇచ్చిన బాణీ.. శ్రీరామచంద్ర (SreeramaChandra) పాడిన తీరు మెస్మరైజింగ్‌ ఉంది. పాటను వింటే ఉత్తేజభరితంగా, ఆలోచనరేకెత్తించేలా ఉంది. ప్రస్తుతం ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది. శ్రేయారాణి, ఆనీ, క్యూ మధు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్యకుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో శ్రీరామసిద్ధార్థ కృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు. (Sankellu Lyrical Song From Nindha Out)

Read Latest Cinema News

Updated Date - May 25 , 2024 | 04:51 PM