Meenakshi Chaudhary: మహేష్ బాబు, విజయ్.. ఇద్దరూ క్రమశిక్షణ గల హీరోస్

ABN, Publish Date - Sep 04 , 2024 | 07:52 PM

దళపతి విజయ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుల కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో చిత్ర విశేషాలను హీరోయిన్ మీనాక్షి చౌదరి మీడియాకు తెలియజేసింది.

Meenakshi Chaudhary

దళపతి విజయ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుల కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటించింది. ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను హీరోయిన్ మీనాక్షి చౌదరి మీడియాకు తెలియజేసింది.

దళపతి విజయ్‌తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

విజయ్‌గారితో వర్క్ చేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. విజయ్‌గారు పాలిటిక్స్‌కి ఎంటర్ అయ్యే ముందు చేసిన లాస్ట్ సినిమా ఇది. ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. సినిమా రిలీజ్ కోసం చాలా ఎక్సయిటింగ్‌గా ఎదురుచూస్తున్నాను.

ఈ ప్రాజెక్ట్‌లోకి మీరెలా వచ్చారు?

డైరెక్టర్ వెంకట్ ప్రభు‌గారు ఈ క్యారెక్టర్ కోసం అప్రోచ్ అయ్యారు. నా లుక్ టెస్ట్ చేసిన తర్వాత క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్ అని సెలెక్ట్ చేశారు.


ఇందులో మీ క్యారెక్టర్ ఎలా వుంటుంది?

నాది యంగ్ మోడరన్, కాలేజ్ గోయింగ్ గర్ల్ క్యారెక్టర్. వెరీ ఫన్ అండ్ లవింగ్‌గా వుంటుంది. నా పర్సనల్ లైఫ్‌కి కూడా రిలేటబుల్ క్యారెక్టర్ ఇది. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్‌కి ఒక లేయర్ వుంటుంది. కథలో నా క్యారెక్టర్‌కి చాలా ఇంపార్టెన్స్ వుంటుంది. సినిమా చాలా ఎక్సయిటింగ్‌గా వుంటుంది. (Meenakshi Chaudhary Interview About The Goat)

మహేష్ బాబుతో వర్క్ చేశారు. ఇప్పుడు విజయ్‌తో.. వారి మధ్య ఎలాంటి పోలికలు కనిపించాయి?

ఈ ఇద్దరితో వర్క్ చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఇద్దరూ చాలా క్రమశిక్షణ గల హీరోస్. సెట్స్‌లో అందరినీ సమానంగా గౌరవిస్తారు. వారితో వర్క్ చేయడం లైఫ్ టైం ఆపర్చ్యునిటీ.

ఈ సినిమాలో స్నేహ, లైలా వంటి సీనియర్స్‌తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

స్నేహ, లైలా వంటి సీనియర్స్‌తో వర్క్ చేయడం గ్రేట్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. కెరీర్ బిగినింగ్‌లోనే ఇలాంటి అవకాశం రావడం ఆనందంగా వుంది. అందరూ నన్ను చాలా కేర్‌గా చూసుకున్నారు.

డైరెక్టర్ వెంకట్ ప్రభు గురించి?

వెంకట్ ప్రభు‌గారు కూల్ పర్సన్. చిల్‌గా వుంటారు. ఆయన ఫిల్మ్ మేకింగ్ యూనిక్‌గా వుంటుంది. చాలా సపోర్టివ్‌గా వుంటారు. ఆయనతో వర్క్ చేయడం వెరీ న్యూ ఎక్స్‌పీరియన్స్.


బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం వెనుక స్పెషల్ ప్లాన్ ఉందా?

స్పెషల్ ప్లాన్ అంటూ ఏమీ లేదు. ఇందులో 2023లో సైన్ చేసిన సినిమాలు కూడా వున్నాయి. ‘లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ’ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్‌కి రావడం కోఇన్సిడెంట్. ఇలాంటి మంచి సినిమాలలో పార్ట్ కావడం చాలా ఆనందంగా వుంది.

మీ సినిమాల ఎంపిక ఎలా వుంటుంది?

స్క్రిప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. కథ నచ్చితే తర్వాత నా క్యారెక్టర్ గురించి చూస్తాను. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని ఇష్టపడతాను. ‘మట్కా’ పిరియడ్ ఫిలిం, అందులో నాది వెరీ డిఫరెంట్ అవతార్. ‘మెకానిక్ రాకీ’లో మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపిస్తా. ‘లక్కీ భాస్కర్’లో మదర్ రోల్ ప్లే చేశా. అనిల్ రావిపూడి సినిమాలో కాప్ రోల్ చేస్తున్నాను. ఇవన్నీ దేనికవే స్పెషల్‌గా వుంటాయి.

ఫైనల్‌గా ‘ది గోట్’ గురించి ఏం చెబుతారు?

‘ది గోట్’ సినిమా అందరికీ న్యూ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. ప్రతి ఒక్కరూ థియేటర్లకు వచ్చి ఈ సినిమాను సక్సెస్ చేయాలని కోరుతున్నాను.

Read Latest Cinema News

Updated Date - Sep 04 , 2024 | 07:52 PM