The GOAT: దళపతి విజయ్..‘ది గోట్‌’ సినిమా నిడివి ఎంతో తెలుసా!

ABN , Publish Date - Aug 27 , 2024 | 06:42 AM

దళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). తాజాగా ఈ మూవీ సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

goat

దళపతి విజయ్ (Thalapathy Vijay), హీరోగా వెంకట్ ప్రభు (Venkat Prabhu) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మించారు. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటించింది. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనుంది.ఇటీవ‌లే ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని విడుదల చేయ‌గా మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది..

GVrQgIaagAAQFGU.jpeg

తాజాగా ఈ ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైం) (The GOAT) మూవీ సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్‌ బృందం ‘యూ/ఏ’ సర్టిఫికెట్‌ను మంజూరు చేసింది. అలాగే, భారీ యాక్షన్‌, సైంటిఫిక్‌ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రం నిడివి కూడా సుమారు 2 గంటల 30 నిమిషాలుగా ఉంది.


GVrQgGwaQAAMg9H.jpeg

కాగా, ఈ సినిమాలో విజయ్‌తో పాటు ప్రశాంత్ (Prashanth), ప్రభుదేవా (Prabhudeva), లైలా ( Laila,), స్నేహ (Sneha), మోహన్ (Mohan), జయరాం ( Jayaram), వైభవ్‌, ప్రేమ్‌జీ, మీనాక్షి చౌదరి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఏజీఎస్‌ నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా (Yuvan Shankar Raja) సంగీతం అందించారు. వినాయకచవితి పండుగ సందర్భంగా వచ్చే నెల 5న విడుదల కానుంది.

Updated Date - Aug 27 , 2024 | 06:42 AM