Nabha Natesh: డార్లింగ్.. కథ విన్న వెంటనే నా మైండ్ సెట్ ఏంటంటే?
ABN, Publish Date - Jul 13 , 2024 | 06:19 PM
ప్రియదర్శి, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ నభా నటేష్ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.
ప్రియదర్శి (Priyadarshi), నభా నటేష్ (Nabha Natesh) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘డార్లింగ్’ (Darling). అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ నభా నటేష్ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. (Nabha Natesh Interview)
మళ్ళీ కమ్ బ్యాక్.. వరుస అనౌన్స్మెంట్స్.. ఎలా ఫీలౌతున్నారు?
దాదాపు రెండేళ్ళుగా నా నుంచి సినిమా రాలేదు. థియేటర్స్‌లో ప్రేక్షకులు నన్ను చూడటానికి, నేను నన్ను థియేటర్స్‌లో చూసుకోవడానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. ప్రేక్షకులకి నా ఎనర్జీ ఇష్టం. యాక్సిడెంట్ వలన నా సోల్డర్కి గాయమైంది. మళ్ళీ ఫిట్ అయి మునుపటి ఎనర్జీ వచ్చిన తర్వాతే స్క్రీన్ మీద కనిపించాలని అనుకున్నాను. అందుకే బ్రేక్ వచ్చింది. ఇప్పుడు ‘డార్లింగ్’తో మళ్ళీ ప్రేక్షకులు ముందుకు రావడం చాలా ఆనందంగా వుంది.
డైరెక్టర్ అశ్విన్ రామ్ ఈ కథ చెప్పినప్పుడు ఎలా అనిపించింది?
స్క్రిప్ట్ చాలా నచ్చింది. నా పాత్ర అయితే ఇంకా నచ్చింది. ఇది ఛాలెంజింగ్ రోల్. ఇప్పటివరకూ ఇలాంటి రోల్ చేయలేదు. స్ప్లిట్ పర్సనాలిటీ వున్న ఈ పాత్రని పెర్ఫార్మ్ చేయడం ఛాలెంజింగా అనిపించింది. కామెడీ, లవ్ స్టోరీ ఎంటర్టైనర్లో ఇలాంటి క్యారెక్టర్ పెట్టడం చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. అశ్విన్ ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా ఎక్సయిటింగ్‌గా అనిపించింది. మంచి కథ కోసం ఎదురుచూస్తున్న సమయంలో వచ్చిన అద్భుతమైన స్క్రిప్ట్ ‘డార్లింగ్’. (Heroine Nabha Natesh About Darling Movie)
ఎనర్జిటిక్ రోల్స్ చేయడానికే ఇష్టపడతారా?
ఎంటర్టైనింగ్గా వుండే రోల్స్‌ని పిక్ చేయడానికి ఇష్టపడతాను. ఎంటర్టైనింగ్గా వుండే సినిమాలంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ సినిమాలు చూస్తూనే పెరిగాను.
ఈ సినిమాలో ఫన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ ఎలా వుంటాయి?
‘డార్లింగ్’ ఫన్, లవ్, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఇలా అన్నీ వున్న కంప్లీట్ ఎంటర్టైనర్.
స్ప్లిట్ పర్సనాలిటీ యాక్టింగ్ కోసం హోం వర్క్ చేశారా?
ఒక సినిమాలో రెండు డిఫరెంట్ పాత్రలు చేస్తున్నాననే జోన్లో అప్రోచ్ అయ్యాను. ఇందుకోసం చాలా హోం వర్క్ చేశాను. స్ప్లిట్ పర్సనాలిటీ పాత్రలు వున్న చాలా సినిమాలు చూశాను. అలాగే చెన్నై నుంచి ఒక యాక్టింగ్ స్పెషిలిటేటర్ కూడా వచ్చారు.
‘డార్లింగ్’ (Darling Movie) స్క్రిప్ట్ విన్న తర్వాత మీ ఫస్ట్ రియాక్షన్?
కథ విన్న వెంటనే సెట్స్‌కి వెళ్లి చేసేద్దామని ఫిక్స్ అయిపోయా( నవ్వుతూ). అశ్విన్ అద్భుతమైన నేరేటర్. తను చెప్పినప్పుడే సినిమా ఎంత అద్భుతంగా వుంటుందో అర్థమైంది.
ప్రియదర్శితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
ప్రియదర్శితో కలిసి వర్క్ చేయడం చాలా బావుంది. మాఇద్దరి మధ్య నడిచే కథ. నా యాక్షన్‌కి ఆయన రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. మా కెమిస్ట్రీ అద్భుతంగా వర్క్ అయ్యింది. తను చిల్ పర్సన్. తన కామెడీ టైమింగ్ చాలా నేచురల్‌గా ఉంటుంది.
డైరెక్టర్ అశ్విన్ రామ్ గురించి?
అశ్విన్ చాలా క్లారిటీ వున్న దర్శకుడు. అద్భుతమైన స్క్రిప్ట్ రాశారు. తను ఈ సబ్జెక్ట్‌ని హ్యాండిల్ చేసిన విధానం అద్భుతం అనిపించింది. తను కథ చెప్పినప్పుడే సినిమాని విజువలైజ్ చేయగలిగాను.
ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ నిర్మాతల గురించి?
వెరీ నైస్ ప్రొడ్యూసర్స్. సినిమాకి కావాల్సిన ప్రతీది ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సమకూర్చారు. యూనిక్ స్క్రిప్ట్స్‌పై నమ్మకం పెడతారు. అలాంటి పాషన్ వున్న నిర్మాతలతో పని చేయడం ఆనందంగా వుంది.
మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ (Vivek Sagar) గురించి?
వివేక్ సాగర్ నా ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్. నా కెరీర్లో ఫస్ట్ టైం సోలో ట్రాక్ ‘డార్లింగ్’లో దొరికింది. ఈ పాట అద్భుతంగా వచ్చింది. అలాగే ఇందులో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. బీజీఎం కూడా అద్భుతంగా చేశారు.
మీకు ఏ జోనర్ చిత్రాలు ఇష్టం?
నాకు అన్ని రకాల సబ్జెక్ట్స్ ఇష్టం. ప్రతిసారి కొత్తగా చేయాలనే తాపత్రయం ఉంది.
మీకు డ్రీమ్ రోల్స్ ఉన్నాయా?
‘డార్లింగ్’లో చేసిన రోల్ నా డ్రీమ్ రోల్ (Dream Role).
కొత్తగా చేస్తున్న సినిమాలు?
‘స్వయంభూ’లో ఓ మంచి పాత్ర చేస్తున్నాను. మరో రెండు సినిమాలు డిస్కర్షన్లో వున్నాయి. ప్రస్తుతం ‘డార్లింగ్’ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను.