Nabha natesh: ఇస్మార్‌ బ్యూటీకి గాయాలు.. ఇప్పుడంతా ఓకె

ABN , First Publish Date - 2023-01-10T15:15:13+05:30 IST

ఇస్మార్ట్‌ బ్యూటీ నభానటేశ్‌ ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎడమ భుజానికి గాయమై సర్జరీ చేయించుకున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలిపారామె. ‘

Nabha natesh: ఇస్మార్‌ బ్యూటీకి గాయాలు..  ఇప్పుడంతా ఓకె

ఇస్మార్ట్‌ బ్యూటీ నభానటేశ్‌(nabha natesh) ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎడమ భుజానికి గాయమై సర్జరీ (injured and surgery) చేయించుకున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలిపారామె. ‘‘గత ఏడాది చాలా క్లిష్టంగా గడిచింది. నా ఎడమ భుజానికి గాయమైంది. బోన్స్‌ ఫ్రాక్చర్స్‌ కావడం వల్ల సర్జరీలు చేయించుకోవలసి వచ్చింది. చికిత్స సమయంలో తీవ్రమైన శారీరక, మానసిక బాధను ఎదురుకున్నాను. దీని వల్ల సినిమాలకు కొంత గ్యాప్‌ వచ్చింది. ప్రసుతం నేను కోలుకున్నా. నాకు నచ్చిన, వచ్చిన పని చేయడానికి రెడీగా ఉన్నాసెట్లో దర్శనమిస్తా’ అని అన్నారు.

ఇస్మార్ట్‌ శంకర్‌ హిట్‌ తర్వాత వరుసగా అవకాశాలు అందుకున్నా...ఈ కన్నడ బ్యూటీకి సరైన విజయం వరించలేదు. గత రెండు చిత్రాలు అల్లుడు అదుర్స్‌ మాస్ట్రో చిత్రాలు అంతగా ఆడలేదు. ఈలోపు తన చేతికి గాయం కావడంతో సినిమాలకు కాస్త దూరమయ్యారు.

Updated Date - 2023-01-10T16:39:36+05:30 IST