Bhagyashri Borse: బచ్చన్ లైఫ్‌లో జిక్కీ చాలా ఇంపార్టెంట్..

ABN , Publish Date - Aug 09 , 2024 | 06:54 PM

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై గ్రాండియర్‌గా నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర విశేషాలను హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే శుక్రవారం మీడియాకు తెలియజేశారు.

Heroine Bhagyashri Borse

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan). ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై గ్రాండియర్‌గా నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఇందులో రవితేజకు జోడీగా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) నటించిన ఈ సినిమా ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్ర హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే.. మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

మీరు నటిగా ఎలా మారారు? ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఆఫర్ ఎలా వచ్చింది?

మాది ఔరంగాబాద్, మహారాష్ట్ర. మా నాన్నగారి ఉద్యోగ రిత్యా లాగోస్(నైజీరియా) షిఫ్ట్ అయ్యారు. అక్కడే నా స్కూలింగ్ జరిగింది. బిజినెస్ మ్యానెజ్మెంట్ కోసం ముంబై వచ్చాను. గ్రాడ్యుయేషన్‌లో ఉండగా చాలా మంది మోడలింగ్ చేయమని ప్రోత్సహించారు. ఆ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత చాలా నచ్చింది. కెమెరా భయం పోయింది. అప్పుడే పూర్తి స్థాయి నటిగా మారాలని అనుకున్నాను. కొన్ని కమర్షియల్స్ కూడా చేశాను. ఈ ప్రాజెక్ట్‌లో అవకాశం అంటే.. మంచి ఛాన్స్ కోసం చూస్తున్నప్పుడు ‘మిస్టర్ బచ్చన్’ అవకాశం వచ్చింది. హైదరాబాద్‌కి వచ్చి ఆడిషన్ ఇచ్చాను. నా ఆడిషన్ మేకర్స్‌కి నచ్చింది. సినిమాలోని జిక్కీ పాత్రకు నేను పర్ఫెక్ట్ అని సెలెక్టర్స్ అనుకున్నారు. తర్వాత లుక్ టెస్ట్ కోసం వచ్చినపుడు రవితేజ గారిని కలిశాను.

టాలీవుడ్‌లో ఫస్ట్ ఫిల్మ్ మాస్ మహారాజా రవితేజతో.. ఆయన ఎనర్జీ‌ని మ్యాచ్ చేయగలిగారా?

నేను ఏదైనా చేసినప్పుడు 100 శాతం ఎఫర్ట్ పెడతాను. హార్డ్ వర్క్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా వుంటాను. రవితేజగారితో వర్క్ చేయడం చాలా ఎక్సయిటింగ్‌గా అనిపించింది. ఆయన ఛార్మింగ్ పర్సనాలిటీ. (Bhagyashri Borse Interview)


Bhagyashri-2.jpg

ఈ సినిమాలో మీ పాత్ర గురించి..?

ఇందులో నా పాత్ర పేరు జిక్కీ. తను తెలుగు మార్వాడి అమ్మాయి. తను చాలా క్యూట్, లవబుల్. డైరెక్టర్ ఈ క్యారెక్టర్‌ని చాలా బ్యూటీఫుల్‌గా తీర్చిదిద్దారు. బచ్చన్ లైఫ్‌లో జిక్కీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సినిమా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేసేలా వుంటుంది.

ఈ సినిమాలో మీ మెమరబుల్ మూమెంట్ ఏదైనా ఒకటి..?

ఇందులో క్యాసెట్ రికార్డింగ్ షాప్‌లో ఓ సీన్ వుంటుంది. ఆ సీన్ చేసిన తర్వాత డైరెక్టర్‌గారు.. ‘నిన్ను చూసి గర్వపడుతున్నాను’ అన్నారు. అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

తెలుగులో ఇది మీ మొదటి సినిమా.. తొలి సినిమాకే డబ్బింగ్ చెప్పడం ఎలా అనిపించింది?

అవును ఇది నా మొదటి తెలుగు సినిమా. నా వాయిస్ అయితే ఆడియన్స్ మరింత రిలేట్ చేసుకుంటారని డైరెక్టర్‌గారిని నేను కోరాను. తెలుగు డబ్బింగ్ చెప్పడం మొదట్లో కాస్త కష్టం అనిపించింది. అయితే డైరెక్షన్ డిపార్ట్మెంట్, టీం చాలా సపోర్ట్ చేసింది. దాదాపు వారం రోజుల్లో డబ్బింగ్ మొత్తం ఫినిష్ చేశాను. చాలా బాగా వచ్చింది.

షూటింగ్‌లో ఎదురుకున్న ఛాలెంజింగ్ పార్ట్ ఏమిటి?

నేను నార్త్ అమ్మాయిని. తెలుగు భాషని మొదట్లో అర్థం చేసుకోవడం కాస్త కష్టం అనిపించింది. ప్రతి డైలాగ్‌ని నా మాతృ భాషకి ట్రాన్స్‌లేట్ చేసుకొని అర్థం చేసుకున్నాను. అయితే కొద్దిరోజుల తర్వాత భాషపై పట్టు సాధించాను. తర్వాత అంతా ఈజీ అయ్యింది. తెలుగు భాష చాలా బ్యూటీఫుల్‌గా వుంటుంది. పూర్తిగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. (Bhagyashri Borse About Mr Bachchan Movie)


Bhagyashri-3.jpg

హరీష్ శంకర్‌తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

హరీష్ గారు చాలా పాషనేట్ డైరెక్టర్. ఆయనతో వర్క్ చేయడం చాలా ఫన్ ఎక్స్‌పీరియన్స్. హరీష్‌గారు, రవిగారికి ఎంతో అనుభవం వుంది. నేను ‘చందూ చాంపియన్’లో చిన్న క్యామియో తప్పితే సినిమాలు చేయలేదు. వారిద్దరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. వారి సపోర్ట్‌తో ఎక్కడా డిఫికల్ట్ ఫీల్ అవ్వలేదు. ప్రతి సీన్‌ని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాం.

మాస్ మహారాజా నుంచి ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు?

రవితేజ‌గారు ఎన్నో సినిమాలు చేశారు. కానీ ఇప్పటికీ ఆయన న్యూకమ్మర్‌లానే వుంటారు. సెట్‌లో టైమ్‌కి వుంటారు. ఎవరికీ ట్రబుల్ ఇవ్వరు. అందరినీ కేరింగ్‌గా చూసుకుంటారు. మనం ఏ స్టేజ్‌లో వున్నా మన క్రాఫ్ట్‌కి గౌరవం ఇవ్వాలని ఆయన్ని చూసి నేర్చుకున్నాను.

సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ గురించి?

మిక్కీ బ్యూటీఫుల్ సాంగ్స్ ఇచ్చారు. రెప్పల్ డప్పుల్, సితార్, జిక్కీ పాటలు చార్ట్‌బస్టర్ అయ్యాయి. ఎక్కడ విన్నా ఇవే పాటలు వినిపిస్తున్నాయి. నా మొదటి సినిమాకే ఇంత అద్భుతమైన ఆల్బమ్ రావడం చాలా ఆనందంగా వుంది.

Bhagyashri-Borse-1.jpg

పాటల్లో మీ డ్యాన్స్ మూమెంట్స్ ట్రెండింగ్‌లో వున్నాయి? ఈ రెస్పాన్స్ ఊహించారా?

నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. ఫ్రీ టైమ్‌లో డ్యాన్స్ చేస్తుంటాను. మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి ఆడిటోరియం దద్దరిల్లింది. డ్యాన్స్ మూమెంట్స్‌కి ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా వుంది. ఇదొక డ్రీం కం ట్రూ మూమెంట్ నాకు. (Heroine Bhagyashri Borse)

నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్ గురించి?

నా మొదటి తెలుగు సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్‌లో చేయడం చాలా ఆనందంగా వుంది. వారు చాలా స్వీట్ పీపుల్. చాలా కంఫర్ట్బుల్‌గా చూసుకున్నారు. వారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్.

మిమ్మల్ని నేషనల్ న్యూ క్రష్ అంటున్నారు?

థాంక్ యూ. అదొక కాంప్లిమెంట్‌లా తీసుకుంటాను.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా..?

కొన్ని ప్రాజెక్ట్స్ వున్నాయి. త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేస్తారు.

Also Read- NTR: ఎన్టీఆర్ పేరుతో మరో వారసుడు.. ఫ్యాన్స్‌లో కన్ఫ్యూజన్


Read Latest Cinema News

Updated Date - Aug 09 , 2024 | 06:54 PM

Mr Bachachan: ఓవర్‌ చేయకురోయ్‌.. నీ దిష్టే తగిలేలా  ఉంది!

Mr Bachchan: జిక్కి లిరికల్ వీడియో సాంగ్

Mr Bachchan: రవితేజ ‘మిస్టర్ బచ్చన్‌’లో జగ్గు భాయ్ అవతార్ చూశారా..

Mr Bachchan: స్పీకర్స్ బద్దలయ్యే ‘రెప్పల్ డప్పుల్’ సాంగ్ వచ్చేసింది

Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ రొమాంటిక్ మెలోడీ రిలీజ్ అప్డేట్..