Mr Bachchan: స్పీకర్స్ బద్దలయ్యే ‘రెప్పల్ డప్పుల్’ సాంగ్ వచ్చేసింది

ABN , Publish Date - Jul 25 , 2024 | 09:11 PM

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతోన్న ఈ చిత్రం మ్యూజిక్ ప్రమోషన్స్‌ను మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర సెకండ్ సింగిల్ ‘రెప్పల్ డప్పుల్‌’ను మేకర్స్ విడుదల చేశారు.

Mr Bachchan Movie Stills

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan). ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతోన్న ఈ చిత్రం మ్యూజిక్ ప్రమోషన్స్‌ను మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘సితార్‌’కు సూపర్బ్ రెస్పాన్స్‌తో చార్ట్ బస్టర్ లిస్ట్‌లో నిలవగా.. గురువారం, మేకర్స్ సెకండ్ సింగిల్ ‘రెప్పల్ డప్పుల్‌’ (Reppal Dappul Lyrical Song)ను విడుదల చేశారు. మాస్ బీట్‌తో వచ్చిన ఈ సాంగ్ ఇప్పుడు టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Also Read- 30 Years Prudhvi: ఢిల్లీలో జగన్‌ని ఆ ప్రశ్న అడిగిన విలేఖరిని అభినందించా..

‘రెప్పల్ డప్పుల్’ హైలీ ఎనర్జిటిక్ బీట్‌లతో కూడిన కంప్లీట్ మాస్ నంబర్. మ్యూజిక్ కంపోజిషన్, ట్యూన్‌లో ఈ మాస్ నంబర్‌ను మ్యాసీ బ్లాక్‌బస్టర్‌గా మార్చేలా కంపోజ్ చేశారు మిక్కీ జె మేయర్ (Mickey J Meyer). ఆర్కెస్ట్రేషన్ అద్భుతంగా వుంది. సింగర్స్ అనురాగ్ కులకర్ణి, మంగ్లీ తమ స్పెషల్ వోకల్స్‌తో పాట వినసొంపుగా ఉంది. కాసర్ల శ్యామ్ లిరిక్స్ ఈ ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ నంబర్ బీట్‌లను పెర్ఫెక్ట్‌గా మ్యాచ్ చేశాయి. ఇది ప్రతి మాస్ పార్టీ ప్లేలిస్ట్‌లో ఉండే సాంగ్ అనేలా అప్పుడే వైబ్రేషన్స్ మొదలయ్యాయి.


Ravi-teja.jpg

రవితేజ, భాగ్యశ్రీ బోర్సే డ్యాన్స్ ఫ్లోర్‌‌ని ఆదరగొట్టారు. ఇందులో రవితేజ స్మార్ట్‌గా కనిపించగా, భాగ్యశ్రీ బోర్సే తన మాస్ స్టెప్పులు, గ్లామర్‌తో పాటపై మరింత ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేస్తోంది. ఈ మాస్ బ్లస్టర్‌కు భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ అయాంక బోస్, ప్రొడక్షన్ డిజైన్ బ్రహ్మ కడలి, ఎడిటర్‌గా ఉజ్వల్ కులకర్ణి బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

Ravi-Mr-Bachchan.jpg

Read Latest Cinema News

Updated Date - Jul 25 , 2024 | 09:11 PM

Mr Bachchan: మాస్ మహారాజా రవితేజ.. ఇంకోటి మొదలెట్టారు..

Mr Bachachan: ఓవర్‌ చేయకురోయ్‌.. నీ దిష్టే తగిలేలా  ఉంది!

Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ సితార్ సాంగ్.. భాగ్యశ్రీ బోర్స్ అసలేముందిలే..!

Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’.. స్పీకర్‌లను బ్లాస్ట్ చేసే సాంగ్ అప్డేట్ వచ్చేసింది..

Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’లోని ‘రెప్పల్ డప్పుల్’ లిరికల్ సాంగ్