Mr Bachachan: ఓవర్‌ చేయకురోయ్‌.. నీ దిష్టే తగిలేలా  ఉంది!

ABN , Publish Date - Jun 23 , 2024 | 02:51 PM

  మాస్‌ మహారాజ్‌ రవితేజ (Ravi teja) ఈ ఏడాది 'ఈగల్‌' (Eagle) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా చేరుకోలేదు. తదుపరి చిత్రాలు బంపర్‌  హిట్  కావాలని రవితేజ కృషి చేస్తున్నారు.

Mr Bachachan: ఓవర్‌ చేయకురోయ్‌.. నీ దిష్టే తగిలేలా  ఉంది!

 
మాస్‌ మహారాజ్‌ రవితేజ (Ravi teja) ఈ ఏడాది 'ఈగల్‌' (Eagle) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా చేరుకోలేదు. తదుపరి చిత్రాలు బంపర్‌  హిట్  కావాలని రవితేజ కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా హరీశ్  శంకర్‌ దర్శకత్వంలో ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr Bachachan) సినిమా చేస్తున్నారు. ‘నామ్‌ తో సునా హోగా ‘ అనేది ఈ సినిమా ట్యాగ్‌ లైన్‌. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిబొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రవితేజ, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో గతంలో షాక్‌, మిరపకాయ్‌ చిత్రాలొచ్చాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్‌ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బాలీవుడ్‌ హిట్‌ మూవీ రైడ్‌ కు రీమేక్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ  బోర్సే కథానాయికగా నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన టైటిల్‌ పోస్టర్‌ ఆకట్టుకుంది. అందులో అమితాబ్‌ పోజ్‌లో కనిపించి అలరించాడు రవితేజ. ఇందులో ఆయన అమితాబ్‌కు ఫ్యాన్ గా  కనిపిస్తారు.  

తాజాగా ఓ చిత్ర బృందం ఓ షో రీల్‌ విడుదల చేశారు. ఎలాంటి డైలాగ్స్‌ లేకుండా కేవలం యాక్షన్‌ సీక్వెన్స్‌తో ఈ షో రీల్‌ సాగింది. ఈ సినిమాలో ఓ సాంగ్‌ షూటింగ్‌ కోసం చిత్ర యూనిట్‌ కాశ్మీర్‌కు వెళ్ళింది. షూటింగ్‌ స్పాట్‌లో రవితేజ ఫోటో పోస్ట్‌ చేసి "ప్రపంచకంలో అందరికి వయసొస్తుంది. ఒక్క అన్నయ్యకి తప్ప’ అంటూ కాశ్మీర్‌ లోయలో అద్భుతంగా షూటింగ్‌ చేశాం. త్వరలో హైదరాబాద్‌లో ల్యాండ్‌ అవుతాం’ అని  హరీష్‌ శంకర్‌ ట్వీట్‌ చేశారు.  ఈ ట్వీట్‌కు రవితేజ రియాక్ట్‌ అయ్యారు. "ఓవర్‌ చేయకురోయ్‌.. నీ దిష్టే తగిలేలా వుంది’ అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

Updated Date - Jun 23 , 2024 | 02:51 PM