Mr Bachchan: మాస్ మహారాజా రవితేజ.. ఇంకోటి మొదలెట్టారు..

ABN , Publish Date - Dec 28 , 2023 | 10:45 PM

హిట్టు, ఫ్లాప్‌లతో పని లేకుండా నిత్యం షూటింగ్‌లతో బిజీగా ఉండే హీరో ఎవరయ్యా? అంటే కచ్చితంగా మాస్ మహారాజా రవితేజ పేరే వినిపిస్తుంది. తాజాగా ఆయన మరో సినిమా షూటింగ్‌ని మొదలెట్టారు. రవితేజ హీరోగా.. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యాజికల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మిస్టర్ బచ్చన్’ రెగ్యులర్ షూటింగ్ గురువారం నుండి ప్రారంభమైంది.

Mr Bachchan: మాస్ మహారాజా రవితేజ.. ఇంకోటి మొదలెట్టారు..
Mr Bachchan Poster

హిట్టు, ఫ్లాప్‌లతో పని లేకుండా నిత్యం షూటింగ్‌లతో బిజీగా ఉండే హీరో ఎవరయ్యా? అంటే కచ్చితంగా మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) పేరే వినిపిస్తుంది. అందుకు కారణం ఆయన షూటింగ్స్‌తో బిజీగా ఉంటే ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని మొదటి నుండి రవితేజ చెబుతున్నారు. అదే ఆచరిస్తున్నారు. తాజాగా ఆయన మరో సినిమా షూటింగ్‌ని మొదలెట్టారు. రవితేజ (Ravi Teja) హీరోగా.. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar), టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) మ్యాజికల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) రెగ్యులర్ షూటింగ్ గురువారం నుండి ప్రారంభమైంది. రీసెంట్‌గా ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే.

రవితేజ మొదటి రోజు షూట్‌లో పాల్గొన్నారు. సీన్ 6, షాట్ 34తో టీమ్ షూట్ ప్రారంభించింది. రవితేజ స్వయంగా షేర్ చేసిన ఫొటోలో కొంతమంది వ్యక్తులతో కలిసి కనిపించారు. క్లాప్‌బోర్డ్ అతని ముఖాన్ని కవర్ చేసి వుంది. ఈ లెన్తీ షెడ్యూల్‌లో ప్రధాన పాత్రపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్. రవితేజ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్న ఈ సినిమా ట్యాగ్‌లైన్ ‘నామ్ తో సునా హోగా’. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) హీరోయిన్‌గా నటిస్తోంది.


Mr-Bachchan.jpg

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. పనోరమా స్టూడియోస్, టి-సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ప్రస్తుతం రవితేజ షేర్ చేసిన ఫొటో వైరల్ అవుతుండగా.. ‘మిస్టర్ బచ్చన్’ ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

====================

*Alphonse Puthren: విజయకాంత్‌‌‌ని హత్య చేశారు.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

**************************

*Chiranjeevi: ‘నేను’గా.. మనందరి బ్రహ్మానందం!

****************************

*Rajinikanth: రజినీకాంత్‌పై వరద బాధితుల అసహనం!

*****************************

*Prabhas: ప్రభాస్ సత్తా ఏంటో చూపిన ‘సలార్’.. కేవలం 6 రోజుల్లో ఎన్ని కోట్ల వసూళ్లంటే?

****************************

*Vaishnavi Chaitanya: ‘బేబి’ హీరోయిన్‌కు మరో ఛాన్స్.. హీరో ఎవరంటే?

**************************

Updated Date - Dec 28 , 2023 | 10:45 PM