Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’.. స్పీకర్‌లను బ్లాస్ట్ చేసే సాంగ్ అప్డేట్ వచ్చేసింది..

ABN , Publish Date - Jul 23 , 2024 | 10:19 PM

ఫస్ట్ సింగిల్‌తో మెలోడియస్ ట్రీట్ ఇచ్చిన ‘మిస్టర్ బచ్చన్’.. ఈసారి స్పీకర్‌లను బ్లాస్ట్ చేసే ఎనర్జిటిక్ మాస్ చార్ట్‌బస్టర్‌తో రెడీ అయ్యాడు. మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్‌ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ నుంచి సెకండ్ సింగిల్ ‘రెప్పల్ డప్పుల్’ రిలీజ్ ఎప్పుడో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘మిస్టర్ బచ్చన్’ సెకండ్ సింగిల్ జూలై 25న విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ ఓ పోస్టర్ వదిలారు.

Mr Bachchan Movie Still

ఫస్ట్ సింగిల్‌తో మెలోడియస్ ట్రీట్ ఇచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan).. ఈసారి స్పీకర్‌లను బ్లాస్ట్ చేసే ఎనర్జిటిక్ మాస్ చార్ట్‌బస్టర్‌తో రెడీ అయ్యాడు. మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్‌ (Harish Shankar)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ నుంచి సెకండ్ సింగిల్ ‘రెప్పల్ డప్పుల్’ (Reppal Dappul) రిలీజ్ ఎప్పుడో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘మిస్టర్ బచ్చన్’ సెకండ్ సింగిల్ జూలై 25న విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ రవితేజను కలర్ ఫుల్ అవుట్ ఫిట్ లైవ్లీ అవతార్‌లో ప్రజెంట్ చేసింది. రవితేజ మాస్, గ్రేస్‌ఫుల్ మూవ్‌లో కనిపించారు. మిక్కీ జె మేయర్ (Mickey J Meyer) స్కోర్ చేసిన ఈ పాటలో రవితేజ డ్యాన్స్ ఫ్లోర్‌‌ను అదరగొట్టబోతున్నారనే విషయాన్ని ఈ పోస్టర్ తెలియజేస్తోంది.

Also Read- Konidela vs Allu family: డేమేజ్ జరిగింది, మరి పూడ్చటం అల్లు అరవింద్ వంతు కదా!


Mr-Bachchan.jpg

రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమాకు ట్యాగ్‌లైన్. అయాంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్‌గా, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మ్యూజిక్ ప్రమోషన్స్‌ని యమా జోరుగా నిర్వహిస్తున్నారు మేకర్స్. (Mr Bachchan 2nd Single Update)

Read Latest Cinema News

Updated Date - Jul 23 , 2024 | 10:19 PM

Mr Bachachan: ఓవర్‌ చేయకురోయ్‌.. నీ దిష్టే తగిలేలా  ఉంది!

Mr Bachchan: రవితేజ ‘మిస్టర్ బచ్చన్‌’లో జగ్గు భాయ్ అవతార్ చూశారా..

Mr Bachchan: రవితేజ, హరీష్ శంకర్.. ఏందయ్యో ఈ స్పీడ్.. అప్పుడే క్లాప్ కూడా!

Mr Bachchan: మాస్ మహారాజా రవితేజ.. ఇంకోటి మొదలెట్టారు..

Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ ఫస్ట్ సింగిల్ విడుదలకు డేట్ ఫిక్స్