Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ రొమాంటిక్ మెలోడీ రిలీజ్ అప్డేట్..

ABN , Publish Date - Aug 01 , 2024 | 05:58 PM

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన షోరీల్, మొదటి రెండు సింగిల్స్, టీజర్ థంపింగ్ రెస్పాన్స్‌‌ని సొంతం చేసుకుని సినిమాపై అంచనాలు పెంచేశాయి. ప్రస్తుతం ప్రమోషన్స్ కూడా పీక్స్‌లో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ థర్డ్ సింగిల్- జిక్కీకి సంబంధించిన అప్‌డేట్‌‌ని ఇచ్చారు.

Mr Bachchan Movie Still

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan). ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన షోరీల్, మొదటి రెండు సింగిల్స్, టీజర్ థంపింగ్ రెస్పాన్స్‌‌ని సొంతం చేసుకుని సినిమాపై అంచనాలు పెంచేశాయి. ప్రస్తుతం ప్రమోషన్స్ కూడా పీక్స్‌లో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ థర్డ్ సింగిల్- జిక్కీకి సంబంధించిన అప్‌డేట్‌‌ని ఇచ్చారు. (Mr Bachchan 3rd Single Jikki Release Update)

Also Read- Raj Tarun: ఆరోపణలు మాత్రమే, ఆధారాలు చూపించలేదు.. లావణ్య వివాదంపై రాజ్ తరుణ్

‘మిస్టర్ బచ్చన్’ థర్డ్ సింగిల్ ‘జిక్కీ’ అనే మెలోడియస్ రొమాంటిక్ నెంబర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. ఒక రొమాంటిక్ పోస్టర్‌ని, సాంగ్‌కి సంబంధించిన ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను ఆగస్ట్ 2వ తేదీన సాయంత్రం 4 గంటల 59 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ పోస్టర్ విషయానికి వస్తే.. మాస్ మహారాజా రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)ల మెస్మరైజింగ్ కెమిస్ట్రీని ఈ పోస్టర్ ప్రజెంట్ చేస్తోంది. ఈ సాంగ్ వారి ఆన్-స్క్రీన్ రొమాన్స్‌కు సెలబ్రేషన్‌గా మాగ్నటిక్ పెర్ఫార్మన్స్‌తో మెలోడీని బ్లెండ్ చేసేలా ఉండబోతోందనే హింట్‌ని ఇస్తోంది. ఇప్పటి వరకు విడుదలైన ఒక్కో పాట.. ఒక్కో మూడ్‌ని క్రియేట్ చేస్తే.. ఇప్పుడు రాబోయే పాటతో రొమాంటిక్ ప్రియులకు పండగే అన్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. ఈ పోస్టర్ కూడా అదే తెలియజేస్తోంది. ఈ సాంగ్ ప్రోమో చూస్తుంటే టెక్నికల్‌గా ఈ సినిమా హై స్టాండర్డ్స్‌లో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది.


Jikki.jpg

‘మిస్టర్ బచ్చన్’ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యానర్‌పై టీజీ విశ్వ‌ప్రసాద్ (TG Vishwa Prasad) గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. అయాంక బోస్ సినిమాటోగ్రాఫర్‌గా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్‌‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వారి వర్క్ థియేటర్లలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతుందని మేకర్స్ తెలుపుతున్నారు. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, సత్య, నెల్లూరు సుదర్శన్ వంటి వారు ఇతర పాత్రలలో నటించిన ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ దిశగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుతూనే.. మరోవైపు చిత్ర ప్రమోషన్స్‌ను నిర్వహిస్తున్నారు.

Ravi-Teja.jpg

Read Latest Cinema News

Updated Date - Aug 01 , 2024 | 05:58 PM

Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ ఫస్ట్ సింగిల్ విడుదలకు డేట్ ఫిక్స్

Mr Bachchan: స్పీకర్స్ బద్దలయ్యే ‘రెప్పల్ డప్పుల్’ సాంగ్ వచ్చేసింది

Mr Bachchan: రవితేజ ‘మిస్టర్ బచ్చన్‌’లో జగ్గు భాయ్ అవతార్ చూశారా..

Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ సితార్ సాంగ్.. భాగ్యశ్రీ బోర్స్ అసలేముందిలే..!

Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ మూవీలోని సితార్ లిరికల్ సాంగ్