Hero Karthi: స్టంట్‌మేన్‌ ఏళుమలైకు హీరో కార్తీ నివాళి

ABN, Publish Date - Jul 19 , 2024 | 05:38 PM

‘సర్దార్‌-2’ చిత్రం షూటింగ్‌లో జరిగిన ప్రమాదం కారణంగా మృతి చెందిన స్టంట్‌మేన్‌ ఏళుమలై మృతదేహానికి హీరో కార్తీ నివాళులర్పించారు. సాలిగ్రామంలో ఉన్న ఏళుమలై నివాసానికి వెళ్ళిన హీరో కార్తీ.. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మొదట స్టంట్‌మేన్‌ ఏళుమలై మృతదేహాన్ని చూసిన కార్తీ కన్నీటిపర్యంతమయ్యారు.

Hero Karthi Pays Respect to the Dead Stuntman Ezhumalai

‘సర్దార్‌-2’ (Sardar 2) చిత్రం షూటింగ్‌లో జరిగిన ప్రమాదం కారణంగా మృతి చెందిన స్టంట్‌మేన్‌ ఏళుమలై (Stuntman Ezhumalai) మృతదేహానికి హీరో కార్తీ (Hero Karthi) నివాళులర్పించారు. సాలిగ్రామంలో ఉన్న ఏళుమలై నివాసానికి వెళ్ళిన హీరో కార్తీ.. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మొదట స్టంట్‌మేన్‌ ఏళుమలై మృతదేహాన్ని చూసిన కార్తీ కన్నీటిపర్యంతమయ్యారు. పీఎస్‌ మిత్రన్‌ (PS Mithran) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్దార్‌-2’ చిత్రం షూటింగ్‌ స్థానిక సాలిగ్రామంలో జరుగుతోంది.

Also Read-Suman: ఏపీలో సినిమా ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే.. ఆ కండీషన్లు పెట్టకూడదు

అక్కడ స్టంట్‌ మాస్టర్‌ సూపర్‌ సుబ్బరాయన్‌ పర్యవేక్షణలో ఫైట్‌ రిహార్సల్‌ చేస్తుండగా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఏళుమలై స్టంట్‌ రిహార్సల్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు కిందపడటంతో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతికి చిత్ర యూనిట్‌ సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అలాగే, ఏళుమలై కుటుంబానికి అండగా ఉంటామని నిర్మాత లక్ష్మణ్‌ కుమార్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఏళుమలై మృతదేహానికి హీరో కార్తీతోపాటు పలువురు చిత్ర బృంద సభ్యులు నివాళులు అర్పించారు.


‘సర్దార్‌2’ విషయానికి వస్తే.. కార్తీ హీరోగా నటించిన ‘సర్దార్‌’ చిత్రానికి రెండో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. 2022లో ‘సర్దార్‌’ (Sardar) తొలిభాగం వచ్చింది. కార్తీ ద్విపాత్రాభినయం పోషించిన ఈ చిత్రం సూపర్‌డూపర్‌ హిట్‌ సాధించింది. రూ.100 కోట్ల మేరకు వసూళ్ళను రాబట్టిన చిత్రంగా రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో రెండో భాగాన్ని ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై నిర్మాత లక్ష్మణ్‌కుమార్‌ నిర్మిస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jul 19 , 2024 | 05:38 PM