Karthi: సర్దార్-2 మొదలైంది

ABN , Publish Date - Jul 12 , 2024 | 05:50 PM

హీరో కార్తీ 'సర్దార్' సినిమా తమిళం, తెలుగు భాషల్లో సూపర్ హిట్ అయినా సంగతి తెలిసిందే. ఆ సినిమా విడుదలైన కొద్ది రోజుల తర్వాత మేకర్స్ పార్ట్ -2 ను  అధికారికంగా  ప్రకటించారు.

హీరో కార్తీ 'సర్దార్' సినిమా తమిళం, తెలుగు భాషల్లో సూపర్ హిట్ అయినా సంగతి తెలిసిందే. ఆ సినిమా విడుదలైన కొద్ది రోజుల తర్వాత మేకర్స్ పార్ట్ -2 ను  అధికారికంగా  ప్రకటించారు. శుక్రవారం ఈ చిత్రం పూజ   పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. ఈ నెల 15న చెన్నైలో భారీ సెట్స్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్ 2కి దర్శకత్వం వహించనున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ నిర్మించనుంది.

Karthi.jpg

సర్దార్ ఎండింగ్ లో నెక్స్ట్ మిషన్ కంబోడియాలో జరగబోతోందని దర్శకుడు చెప్పారు. అక్కడి నుంచే ఈ సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్  పని చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

Updated Date - Jul 12 , 2024 | 05:52 PM