Sardar2: కార్తీ ‘సర్దార్‌ 2’ షూటింగ్‌లో ప్రమాదం.. స్టంట్‌మెన్ మృతి

ABN , Publish Date - Jul 17 , 2024 | 11:32 AM

సోమవారం పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా కార్తీ ‘సర్దార్‌ 2’ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ షూటింగ్‌లో ఓ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో స్టంట్‌మెన్ ప్రాణాలను కోల్పోయినట్లుగా కోలీవుడ్ నుంచి సమాచారం అందుతోంది. చెన్నై, ప్రసాద్ ల్యాబ్స్‌లో వేసిన సెట్స్‌లో ప్రస్తుతం మేకర్స్ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.

Stuntman Ezhumalai Died at Sardar2 Shooting Spot

సోమవారం పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా కార్తీ ‘సర్దార్‌ 2’ (Karthi Sardar 2) చిత్ర షూటింగ్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ షూటింగ్‌లో ఓ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో స్టంట్‌మెన్ ప్రాణాలను కోల్పోయినట్లుగా కోలీవుడ్ నుంచి సమాచారం అందుతోంది. చెన్నై, ప్రసాద్ ల్యాబ్స్‌లో వేసిన సెట్స్‌లో ప్రస్తుతం మేకర్స్ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రీకరణలో భాగంగా 20 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన స్టంట్‌మెన్ ఎజుమలై (Stuntman Ezhumalai) మృతి చెందినట్లుగా కోలీవుడ్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ నడుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఇంతకు ముందు కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇండియన్ 2’ చిత్రీకరణలో కూడా ఇటువంటి ప్రమాదమే సంభవించడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ ఇలా జరగడంతో కోలీవుడ్ అలెర్ట్ అవ్వాల్సిన సమయం ఆసన్నమైందంటూ నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. (Accident At Sardar2 Shooting Spot)


Also Read- Varalaxmi Couple: ఆమె ఫస్ట్ లవ్ నేను కాదు.. వరలక్ష్మి భర్త సంచలన వ్యాఖ్యలు


Karthi-Sardar-2.jpg

‘సర్దార్‌2’ విషయానికి వస్తే.. కార్తీ హీరోగా నటించిన ‘సర్దార్‌’ చిత్రానికి రెండో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. 2022లో ‘సర్దార్‌’ తొలిభాగం వచ్చింది. కార్తీ ద్విపాత్రాభినయం పోషించిన ఈ చిత్రం సూపర్‌డూపర్‌ హిట్‌ సాధించింది. రూ.100 కోట్ల మేరకు వసూళ్ళను రాబట్టిన చిత్రంగా రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో రెండో భాగాన్ని ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై నిర్మాత లక్ష్మణ్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. తొలి భాగంలో నటించిన నటీనటులే రెండో భాగంలోనూ నటించనున్నారు. అయితే, తొలి భాగానికి జీవీ ప్రకాష్‌ సంగీతం సమకూర్చగా, రెండో భాగానికి మాత్రం యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించనున్నారు. పి.ఎస్. మిత్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. (Sardar2 Movie)

Read Latest Cinema News

Updated Date - Jul 17 , 2024 | 12:42 PM