మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Jr NTR: 'దేవర' సినిమా ఎక్సక్లూసివ్ స్టిల్స్

ABN, Publish Date - Jun 15 , 2024 | 11:53 AM

అల్లు అర్జున్ సినిమా 'పుష్ప 2' వాయిదా పడుతుందని ముందే తెలిసిన ఎన్టీఆర్ 'దేవర' చిత్ర నిర్వాహకులు అక్టోబర్ లో విడుదలవ్వాల్సిన తమ సినిమాని ముందుకు జరిపి సెప్టెంబర్ లో విడుదల చెయ్యడానికి నిర్ణయించారని పరిశ్రమలో అనుకుంటున్నారు.

NTR, Siva Koratala combination Devara part one release date poster

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న 'దేవర' సెప్టెంబర్ 27 కి విడుదలవుతోంది. ఇంతకు ముందు అక్టోబర్ 10న అనుకున్నారు, కానీ ఇప్పుడు విడుదల తేదీ ముందుకు జరిగింది. అంటే 'దేవర' చిత్ర నిర్వాహకులకు 'పుష్ప 2' సినిమా ఆగస్టు 15న రావటం లేదని తెలిసి వాళ్ళ సినిమాని ముందుకు జరిపారు అని ఒక చర్చ పరిశ్రమలో నడుస్తోంది.

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కన్నా, జూనియర్ ఎన్టీఆర్ కి ఇప్పుడు అడ్వాంటేజ్ సమయం అని చెప్పొచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ పై ఇప్పుడు చాల నెగటివిటీ వుంది, అతను వైస్సార్సీపీ సభ్యుడికోసం ప్రచారం చెయ్యడం, ఆ తరువాత సాయి ధరమ్ తేజ్ అతన్ని అన్ ఫాలో కావటం, మెగా కుటుంబం కావాలనే అల్లు అర్జున్ ని పక్కన పెట్టడం ఇటువంటి సమయంలో అతని సినిమా విడుదలవడం మంచిది కాదు అని కూడా ఒక చర్చ నడుస్తోంది.

ఎందుకంటే ఆగస్టు 15న 'పుష్ప 2' విడుదలైతే, ఆ సినిమాని ట్రోల్ చెయ్యడానికి చాలామంది పవన్ కళ్యాణ్, మెగా అభిమానులు రెడీ గా వున్నారు అని ఇటు పరిశ్రమలోనూ, అటు అభిమానుల్లోనూ చర్చ నడుస్తోంది. అందుకని ఆ సినిమా వాయిదా పడింది, ఇప్పుడు అడ్వాంటేజ్ జూనియర్ ఎన్టీఆర్ కి వచ్చింది.

అందుకే తన 'దేవర' పార్టు వన్ ని సెప్టెంబర్ 27 కి విడుదల చేస్తున్నారు. జాన్వీ క‌పూర్ కథానాయికగా న‌టిస్తోన్న ఈ సినిమాలో హిందీ నటుడు సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. నిన్న అధికారికంగా 'దేవర: పార్ట్ 1’, సెప్టెంబ‌ర్ 27న తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌లకానుంది.

‘దేవర’గా టైటిల్ పాత్ర‌లో కనిపించనున్న ఎన్టీఆర్ తో పాటు ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, న‌రైన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాకి నిర్మాతలు.

Updated Date - Jun 15 , 2024 | 11:53 AM