Devara Update : ఆ రెండు సినిమాలతో టీజర్‌!

ABN , First Publish Date - 2023-12-08T14:40:56+05:30 IST

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(Ntr), కొరటాల శివ (Koratala shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’ (Devara). వీరిద్దరి కాంబోలో వస్తున్న  రెండో చిత్రమిది. విస్మయానికి గురైన ఓ తీర ప్రాంతం నేపథ్యంలో పక్కా యాక్షన్  ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Devara Update : ఆ రెండు సినిమాలతో టీజర్‌!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(Ntr), కొరటాల శివ (Koratala shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’ (Devara). వీరిద్దరి కాంబోలో వస్తున్న  రెండో చిత్రమిది. విస్మయానికి గురైన ఓ తీర ప్రాంతం నేపథ్యంలో పక్కా యాక్షన్  ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు పార్టులుగా వస్తున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల చేయడానికి ప్లాన్  చేశారు. ఈ చిత్రానికి  సంబంధించి మోషన్‌ పోస్టర్‌, ఫస్ట్‌ లుక్స్‌ మాత్రమే రిలీజ్‌ చేశారు. అభిమానులు నెక్ట్స్‌ అప్‌డేట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. తర్వాతి అప్‌డేట్‌ టీజర్‌ అని బలంగా నమ్ముతున్నారు ఫ్యాన్స్.  డిసెంబర్‌ 25 లేదా జనవరి ఒకటో తేదీన టీజర్‌ వస్తుందని ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం 'దేవర’ టీజర్‌ని (teaser) సలార్‌, డంకీ విడుదలయ్యే థియేటర్స్‌లో చూడొచ్చని శుక్రవారం నుంచి ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ విషయంపై మేకర్స్‌ నుంచి ఎలాంటి  ప్రకటన లేదు. కానీ సోషల్‌ మీడియా , ఫ్యాన్స్  పేజీల్లో ఈ వార్త విపరీతం వైరల్ అవుతోంది.  ఓవర్సీస్లో  డంకీ సినిమాకి, ఇండియాలో సలార్‌ సినిమాకి సూపర్‌ బజ్‌ ఉంది.  ఈ చిత్రాలతో 'దేవర' టీజర్ విడుదల చేస్తే రీచ్ బావుంటుందని చిత్ర బృందం భావించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలో ఎంత నిజమెంత ఉందో తెలియాలంటే మేకర్స్‌ మాట్లాడాల్సిందే! జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్  ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల అల్యూమినియం ఫ్యాక్టరీలో సైఫ్‌ అలీఖాన్ పై  ఇంట్రడక్షన్ సీన్స్ తీశారు. 

Updated Date - 2023-12-08T14:40:57+05:30 IST