Devara : ఈ షెడ్యూల్‌లో ఏం చేయబోతున్నారంటే!

ABN , First Publish Date - 2023-10-27T18:30:29+05:30 IST

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (jr NTR) గోవాకు పయనమయ్యారు. ఆయన నటిస్తున్న 'దేవర’ (Devara) చిత్రం తాజా షెడ్యూల్‌ గోవాలో ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆయన శుక్రవారం గోవాకు బయలుదేరారు. పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్నారు.

Devara : ఈ షెడ్యూల్‌లో ఏం చేయబోతున్నారంటే!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (jr NTR) గోవాకు పయనమయ్యారు. ఆయన నటిస్తున్న 'దేవర’ (Devara) చిత్రం తాజా షెడ్యూల్‌ గోవాలో ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆయన శుక్రవారం గోవాకు బయలుదేరారు. పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్‌సిటీతోపాటు నగర పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. శంషాబాద్‌లో ప్రత్యేకంగా నెలకొల్పిన షిప్‌లో ఇంట్రడక్షన్ సీన్స్, అండర్‌ వాటర్‌ యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. అలాగే రామోజీ ఫిల్మ్‌ సిటీలో కథానాయిక జాన్వీ కపూర్‌, ఎన్టీఆర్‌పై కీలక సన్నివేశాలతోపాటు, ప్రతినాయకుడిగా నటిస్తున్న సైఫ్‌ అలీఖాన్ తో పొరాట సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పుడు సినిమాకు కీలకంగా నిలచే సన్నివేశాల చిత్రీకరణకు చిత్ర బృందం గోవాకు బయలుదేరింది.

అక్కడ యాక్షన్ సన్నివేశాలతోపాటు పాటలు చిత్రీకరించాలని దర్శకుడు ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్‌లో జాన్వీ మరోసారి జాయిన్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్లాన్ చేశారు మేకర్స్‌. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధా ఆర్ట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిరుద్ధ్‌ రవిచంద్రన స్వరకర్త.

Updated Date - 2023-10-27T18:30:29+05:30 IST