SJ Suryah: ‘బాహుబలి 2, ఇంద్ర’.. ఇవన్నీ కూడా ఆ సినిమా కాన్సెప్టే!

ABN , Publish Date - Aug 25 , 2024 | 11:09 PM

యాక్షన్ సినిమాలన్నీ మాణిక్ బాషా కాన్సెప్ట్‌లోనే వుంటాయి. ఈవెన్ ‘బాహుబలి 2, ఇంద్ర’ సినిమాలలో కూడా మాణిక్ బాషా కాన్సెప్టే ఉంది. అలాంటి తరహా సినిమాలకు కొత్త తరహా యాక్షన్ వివేక్ తీసుకువచ్చారని అన్నారు విలక్షణ నటుడు ఎస్.జె. సూర్య. ఆయన నటించిన ‘సరిపోదా శనివారం’ ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.

SJ Suryah

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. 29 ఆగస్ట్, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ శనివారం హైదరాబాద్‌గా ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు.

Also Read- Chiru- Balayya: చిరుని ఆప్యాయంగా పిలిచిన బాలయ్య.. మాటిచ్చేసిన చిరు!

ఈ కార్యక్రమంలో నటుడు ఎస్.జె. సూర్య (SJ Suryah) మాట్లాడుతూ.. ‘సరిపోదా శనివారం’ చాలా మంచి సినిమా. అందరూ థియేటర్లకు వచ్చి ఈ సినిమా చూసి ఎంకరేజ్ చేయండి. వివేక్ ఆత్రేయ రచన భిన్నమైంది. ఆయన చెన్నైకి వచ్చి నాకు కథ చెప్పారు. ఆయన నెరేషన్ విన్నాక చాలా హ్యాపీగా అనిపించింది. ఇటువంటి రచయితలను అరుదుగా చూస్తుంటాం. ఒకరకమైన యాక్షన్ సినిమాను విభిన్నంగా వివేక్ మలిచారు. అన్ని యాక్షన్ సినిమాలు మాణిక్ బాషా కాన్సెప్ట్‌లోనే వుంటాయి. ఈవెన్ ‘బాహుబలి 2, ఇంద్ర’ సినిమాలలో కూడా మాణిక్ బాషా కాన్సెప్టే ఉంది. అలాంటి తరహా సినిమాలకు కొత్త తరహా యాక్షన్ వివేక్ తీసుకువచ్చారు. విషయం ఏమిటంటే.. సినిమాలో నానికి వాళ్ల అమ్మ కోపంగా ఉండకూడదు అని ప్రామిస్ తీసుకుంటుంది. అందుకే శనివారం అని ఫిక్స్ చేశారు. మిగిలిన రోజుల్లో మాణిక్‌గా వుండే నాని.. శనివారం మాత్ర బాషాగా మారతాడు. ఇటువంటి కాన్సెప్ట్ మరీ మరీ చూసే విధంగా వుంటుంది.


Saripodaa-Sanivaram.jpg

ఇక కానిస్టేబుల్‌గా ప్రియాంక అందంతో పాటు నటనను కనబరిచారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా అన్ని శనివారం నాడు కొన్ని మ్యాజిక్‌లు జరిగాయి. నాది, నాని, సాయికుమార్‌లతో పాటు అందరి పుట్టినరోజులు శనివారమే వచ్చాయి. ఇక డివివి బ్యానర్ ఫెంటాస్టిక్ కంపెనీ. నాని చాలా మంచి మనిషి, నటుడు. విజన్ వున్న నటుడు. సినిమాలపై తపన వుంది. అసిస్టెంట్ దర్శకుడి నుంచి ఈ స్థాయికి చేరారంటే ఆయన కష్టమే ఫలించింది. నేను ఇందులో డబ్బింగ్ ఫర్ఫెక్ట్‌గా చెప్పాను. వివేక్ గారు చాలా ట్రిక్కీగా పాత్రలను డిజైన్ చేశాడు. అలా నా పాత్ర దయాను మలిచారు. అందరూ ఈ నెల 29న సినిమాను థియేటర్లలో చూడండి.. అని అన్నారు.

Read Latest Cinema News

Updated Date - Aug 25 , 2024 | 11:09 PM

Saripodhaa Sanivaaram Trailer: నాని.. 'సరిపోదా శనివారం' ట్రైలర్

Saripodhaa Sanivaaram: ఉల్లాసంగా.. ఉత్సాహంగా 

Saripodhaa Sanivaaram: వాడ్ని ఎవరైనా ఆపాలని అనుకోగలరా? అనుకున్నా.. ఆపగలరా?

Saripodhaa Sanivaaram: యాక్షన్‌తో మొదలైంది

Saripodhaa Sanivaaram: చారులతగా ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది..