Saripodhaa Sanivaaram: ఉల్లాసంగా.. ఉత్సాహంగా 

ABN , Publish Date - Jul 14 , 2024 | 10:12 AM

'సరిపోదా శనివారం' (Saripoda Sanivaaram) నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ 'గరం గరం' నేచురల్ స్టార్ నాని (Nani) ఫెరోషియస్ క్యారెక్టర్ ని ప్రజెంట్ చేసింది. వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్నారు.

'సరిపోదా శనివారం' (Saripoda Sanivaaram) నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ 'గరం గరం' నేచురల్ స్టార్ నాని (Nani) ఫెరోషియస్ క్యారెక్టర్ ని ప్రజెంట్ చేసింది. వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్నారు.  జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. మాస్ ఫీస్ట్ తర్వాత, మేకర్స సెకండ్ సింగిల్ 'ఉల్లాసం' సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇది క్లాసికల్, జాజ్ మ్యూజిక్ ఫ్యూజన్, రొమాంటిక్ నెంబర్ ఇన్స్టంట్ గా హిట్ అవుతోంది, విన్న వెంటనే ట్యూన్‌తో లవ్ లో పడతారు. సనరే రాసిన లిరిక్స్ నాని, ప్రియాంక మోహన్‌ల ఫీలింగ్స్ ని బ్యూటీఫుల్ గా ఎక్స్ ప్రెస్ చేస్తోంది. సంజిత్ హెగ్డే తన వోకల్స్ తో పాటకు ప్రాణం పోయగా, కృష్ణ లాస్య ముత్యాల కూడా తన ఎక్స్ ప్రెస్సీవ్ వాయిస్ తో మ్యాజిక్ చేసింది. నాని, ప్రియాంక మోహన్‌ల జంట తమ నేచురల్ ఎక్స్ ప్రెషన్స్ తో విజువల్స్‌కు బ్యూటీని యాడ్ చేశారు. లిజనర్స్ కి వెంటనే కనెక్ట్ అయ్యే ఈ పాటలో నాని గుడ్ మ్యూజిక్ టేస్ట్ మరోసారి స్పష్టంగా కనిపిస్తుంది. పాన్ ఇండియా అడ్రినలిన్‌ ఫీల్డ్ యాక్షన్-అడ్వెంచర్ సరిపోదా శనివారంలో SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు.  ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది.  

Updated Date - Jul 14 , 2024 | 10:12 AM