Saripodhaa Sanivaaram: చారులతగా ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది..

ABN , Publish Date - Jul 07 , 2024 | 06:13 PM

పాన్ ఇండియా అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ‘సరిపోదా శనివారం’లో నేచురల్ స్టార్ నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ‘గ్యాంగ్ లీడర్’ తర్వాత నానితో ఆమె చేస్తోన్న రెండో చిత్రమిది. శనివారం అప్డేట్స్‌లో ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్‌ విడుదల చేయబోతున్నట్లుగా తెలిపిన మేకర్స్.. ఆదివారం ఆమె ఫస్ట్ లుక్‌ని రివీల్ చేశారు.

Priyanka Mohan in Saripodhaa Sanivaaram

పాన్ ఇండియా అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram)లో నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) సరసన ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ‘గ్యాంగ్ లీడర్’ తర్వాత నానితో ఆమె చేస్తోన్న రెండో చిత్రమిది. శనివారం అప్డేట్స్‌లో ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్‌ విడుదల చేయబోతున్నట్లుగా తెలిపిన మేకర్స్.. ఆదివారం ఆమె ఫస్ట్ లుక్‌ని రివీల్ చేశారు.

Read Also- Lavanya and Raj Tarun Case: మాల్వీపై మోజుతో.. నన్ను వదిలించుకోవడానికే ఇవన్నీ!


ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ప్రియాంక మోహన్ చారులత (Charulatha) అనే ఇన్నోసెంట్ పోలీసుగా కనిపిస్తోంది. ఆమె క్యారెక్టర్‌లో ఫిట్‌గా ఉంది. ఖాకీ దుస్తులు ధరించి, భుజంపై బ్యాగ్‌తో అందమైన చిరునవ్వు ఆమె ఈ లుక్‌లో కనిపించింది. సినిమాలో ప్రియాంక పాత్ర చాలా కీలకంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ లుక్‌తో ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram Movie) ట్యాగ్ సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.


charulatha.jpg

వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ (DVV Entertainment) పతాకంపై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, టాప్ ప్రొడక్షన్ వేల్యూస్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని 29 ఆగస్ట్, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉన్నట్లుగా మేకర్స్ తెలిపారు.

Read Latest Cinema News

Updated Date - Jul 07 , 2024 | 06:16 PM

Saripodhaa Sanivaaram: పిడికిలి బిగించి.. బిగ్గెస్ట్‌ అప్‌డేట్‌ ఇచ్చారు!

Saripodhaa Sanivaaram: దిల్ రాజు చేతుల్లోకి.. డివివి వాళ్ల సినిమా

Saripodhaa Sanivaaram: వాడ్ని ఎవరైనా ఆపాలని అనుకోగలరా? అనుకున్నా.. ఆపగలరా?

Saripodhaa Sanivaaram: యాక్షన్‌తో మొదలైంది

Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ మూవీ గ్లింప్స్