మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Navdeep: నవదీప్ సినిమా 'లవ్ మౌళి' కేవలం పెద్దలకు మాత్రమే అంట!

ABN, Publish Date - May 10 , 2024 | 06:09 PM

నవదీప్ నటించిన 'లవ్ మౌళి' సినిమా జూన్ 7 విడుదలకి సిద్ధం అయింది. ఈ సినిమా సెన్సారు కార్యక్రమాలు పూర్తి చేసుకుందని, ఈ సినిమాకి 'ఏ' సర్టిఫికెట్ కూడా ఇచ్చారని చిత్ర నిర్వాహకులు చెప్పారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే ఇందులో చాలా ఇంటిమసి సన్నివేశాలున్నాయని అందుకే 'ఏ' ఇచ్చినట్టుగా అర్థం అవుతోంది.

Navdeep starrer Love Mouli given 'A' certificate by Censor Board

చాలా కాలం తరువాత నటుడు నవదీప్ కథానాయకుడి పాత్రలో రాబోతున్న సినిమా 'లవ్ మౌళి'. ఈ సినిమాలో నవదీప్ సరికొత్త అవతారంలో నవదీప్ 2.O గా కనబడబోతున్నారని అంటున్నారు. ఈ సినిమా ఇంతకు ముందే విడుదలవ్వాల్సి ఉండగా విడుదలతేదీ వాయిదా వేస్తూ వచ్చి ఇప్పుడు జూన్‌ 7న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రచార చిత్రాలు ఎప్పుడో ప్రారంభించారు, అలాగే నవదీప్ ఈ చిత్ర ప్రచారాల కోసం పలు నగరాలు కూడా తిరిగారు. (Navdeep starrer film 'Love Mouli' gets A certificate by Censor Board)

ఈ సినిమా ప్రచార వీడియోలు కూడా విడుదలయ్యాయి, ఇందులో నవదీప్ కొత్తగా కనపడటమే కాకుండా ఒక చిత్రకారుడిగా కూడా కనపడనున్నారని అర్థం అవుతోంది. నవదీప్ వైవిధ్యంగా కనిపిస్తున్న ఈ చిత్రానికి అవ‌నీంద్ర ద‌ర్శ‌కుడు. ఈ సినిమాకి ఎక్కడా కత్తెర పడకుండా, సెన్సారు పనులు ముగించింది అని ఒక అధికారిక ప్రకటనలో చెప్పారు. అయితే సెన్సారు వారు ఈ చిత్రానికి 'ఏ' సర్టిఫికెట్‌ను కూడా ఇచ్చినట్టుగా చెప్పారు.

ఇప్పుడు అన్ని పనులు తుదిదశకు చేరుకున్నాయని, జూన్‌ 7న విడుద‌లకి రెడీ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు చిత్ర నిర్వాహకులు. సినిమాలో ఇంటిమసి సన్నివేశాలున్నా, రక్తం ఎక్కువ కనిపించే సన్నివేశాలున్నా, 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చేందుకు అవకాశం వుంది, కానీ ఈ చిత్ర ట్రైలర్, టైటిల్ చూస్తుంటే మొదటి కారణంవలన 'ఏ' ఇచ్చివుండొచ్చు అని తెలుస్తోంది.

ఏమైనా ఈ సినిమా 'ఏ' ఇవ్వటంతో ఇది కేవలం పెద్దవాళ్ళకి మాత్రమే అని అర్థం అవుతోంది. ఇది 18 సంవత్సరాల లోపు పిల్లలకి కాదని తెలుస్తోంది. ఇందులో నవదీప్ చాలా వైవిధ్యంగా కనిపించడంతో ఈ సినిమా న‌వ‌దీప్ 2.Oగా ఒక భిన్నమైన భావనతో వుంటుంద‌ని ఈ సినిమా గురించి ఎదురుచూస్తున్నారు అని ఈ సినిమా గురించి ద‌ర్శ‌కుడు అవనీంద్ర చెప్పారు. న‌వ‌దీప్‌ ఈసినిమాతో కొత్త ట్రెండ్ క్రియేట్ చెయ్య‌బోతున్నాడ‌ని కూడా అనుకుంటున్నారు. ఈ సినిమాలో పంఖురి గిద్వానీ కథానాయికగా నటించగా, భావన సాగి ఇంకో ముఖ్యపాత్రలో కనపడతారు.

Updated Date - May 10 , 2024 | 06:11 PM