Navdeep 2.0 : ‘అందాలు చదివే కళ్లకైనా.. ఖండాలు తిరిగే కాళ్లకైనా..!

ABN , First Publish Date - 2023-09-16T18:37:28+05:30 IST

నవదీప్‌ చాలా రోజుల తరువాత హీరోగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌ మౌళి’. అవనీంద్ర దర్శకత్వంలో నైరా క్రియేషన్స్‌ , శ్రీకర స్టూడియోస్‌, సీ స్పేస్‌ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Navdeep 2.0 : ‘అందాలు చదివే  కళ్లకైనా.. ఖండాలు తిరిగే కాళ్లకైనా..!

నవదీప్‌(Navdeep) చాలా రోజుల తరువాత హీరోగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌ మౌళి’(Love mouli). అవనీంద్ర దర్శకత్వంలో నైరా క్రియేషన్స్‌ , శ్రీకర స్టూడియోస్‌, సీ స్పేస్‌ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం నుంచి విడుదలైన నవదీప్‌ ఫస్ట్‌ లుక్‌ ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే! గుబురు గడ్డం.. బైక్‌ ట్రావెలర్‌గా నవదీప్‌ కనిపించడంతో సినీ ప్రియులంతా ఆశ్యర్యానికి గురవ్వటమే కాక ఈ చిత్రం ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో అందర్ని ఆకట్టుకునేలా ఉంటుందని భావిస్తున్నారు. సంగీత దర్శకుడు గోవింద్‌ వసంత అందించిన ‘‘ద ఏంతమ్‌ ఆఫ్‌ లవ్‌ మౌళి’ సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించిన ఈ పాటను అనీష్‌ కృష్ణన్‌ ఆలపించారు.

‘అందాలు చదివే కళ్లకైనా.. ఖండాలు తిరిగే కాళ్లకైనా.. వందేళ్లు కదిలే గుండెకైనా.. ప్రేమన్న తీరం ఇదేనా’ అంటూ సాగే పాట సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటుంది. నవదీప్‌ 2.0 అంటూ ఈ మూవీతో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా డిఫరెంట్‌ మేకోవర్‌తో కనిపించి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మేఘాలయాలోని చిరపుంజీలో ఈ సినిమా షూటింగ్‌ చేశారు. ఇండియాలోనే గరిష్ఠమైన తేమ ఉన్న ప్రాంతంలో చిత్రీకరణ చేసిన తొలి చిత్రమిది. ఈ చిత్రంలో నవదీప్‌ సరసన పంఖురి గిద్వానీ కథానాయుకగా నటించింది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

Updated Date - 2023-09-17T10:11:19+05:30 IST