Navdeep: నా స్వీయ అనుభ‌వాలే.. ఈ సినిమా! ల‌వ్‌మౌళి నుంచి షీఈజ్ రియ‌ల్ లిరిక‌ల్ వీడియో

ABN , Publish Date - Mar 05 , 2024 | 04:50 PM

సూప‌ర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కొంత విరామం తరువాత హీరోగా, స‌రికొత్త‌గా న‌వ‌దీప్‌గా 2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం లవ్‌మౌళి. తాజాగా ఈ చిత్రం నుంచి షీ ఈజ్ రియ‌ల్ అనే లిరిక‌ల్ వీడియోను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

Navdeep: నా స్వీయ అనుభ‌వాలే.. ఈ సినిమా! ల‌వ్‌మౌళి నుంచి షీఈజ్ రియ‌ల్ లిరిక‌ల్ వీడియో
love mouli

సూప‌ర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ (Navdeep) కొంత విరామం తరువాత హీరోగా, స‌రికొత్త‌గా న‌వ‌దీప్‌గా 2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం లవ్‌మౌళి (Love Mouli). విభిన్న‌మైన, వైవిధ్య‌మైన ఈ చిత్రానికి అవ‌నీంద్ర ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ (Nyra Creations) మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో క‌లిసి నిర్మాణ పనులు టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ కి అడ్డాగా మారిన సి స్పేస్ బాధ్య‌తలు తీసుకుంది. ఈ చిత్రం నుంచి వ‌చ్చిన ప్ర‌తి అప్‌డేట్ వినూత్నంగా అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

mouli.jpeg

తాజాగా ఈ చిత్రం నుంచి షీ ఈజ్ రియ‌ల్ (She Is Real) అనే లిరిక‌ల్ వీడియోను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. గోవింద్ వ‌సంత్ (Govind Vasantha) స్వ‌రాలు అందించిన ఈ చిత్రానికి అనంత్ శ్రీ‌రామ్ సాహిత్యాన్ని అందించారు. శ‌ర‌త్ సంతోష్‌, జిబా టామీ ఆల‌పించారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్‌తో పాటు విడుద‌లైన ద ఏంత‌మ్ ఆఫ్ ల‌వ్ మౌళి (Love Mouli) సాంగ్‌కు, హీరో టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చిందన్నారు.


ఈ చిత్రంలో నవదీప్ (Navdeep) చాలా డిఫ‌రెంట్‌గా కనిపించడంతో ఈ సినిమాను న‌వ‌దీప్ 2.Oగా ఒక ఢిఫరెంట్ కాన్నెప్ట్ తో వ‌స్తున్నాడ‌ని అభిమానులంతా భారీ అంచ‌నాల‌తో ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్నార‌న్నారు. తాజాగా విడుద‌లైన పాట‌ల‌ను చూస్తుంటే వీరి అంచ‌నాల‌ను మ‌రింత పెంచే విధంగా ఉంద‌ని అంటున్నారు.

lmouli.jpeg

ఈ సినిమాలో న‌వ‌దీప్ (Navdeep) స‌రికొత్త‌గా క‌నిపిస్తుండ‌డంతో చూసిన వాళ్లంతా కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తాడని అనుకుంటున్నారు. ఇదిలాఉండ‌గా నా లైఫ్ లో జ‌రిగిన ప్రేమ‌క‌థ‌ల‌కు ఫ‌లిత‌మే ఈ సినిమా క‌థ అని. నేను పాన్ ఇండియా లెవ‌ల్‌లో ప్రేమించేవాడిన‌ని, ఈ ప్రేమ అనే టాపిక్‌లో చాలా వెరియేష‌న్స్ ఉన్నాయ‌ని.. నా స్వీయ అనుభ‌వాలే ఈ సినిమా క‌థ అని న‌వ‌దీప్‌ అన్నారు

Updated Date - Mar 05 , 2024 | 05:08 PM