Navdeep: నిజాయితీగా ఉన్న వారిని గెలిపించండి.. నిజాయితీగా తీసిన మా సినిమాని ఆద‌రించండి

ABN , Publish Date - Apr 14 , 2024 | 06:30 PM

కొంత విరామం తరువాత సూప‌ర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ హీరోగా స‌రికొత్త‌గా క‌నిపించబోతున్న చిత్రం లవ్,మౌళి.

Navdeep: నిజాయితీగా ఉన్న వారిని గెలిపించండి.. నిజాయితీగా తీసిన మా సినిమాని ఆద‌రించండి
navadeep

కొంత విరామం తరువాత సూప‌ర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ (Navdeep) హీరోగా, న‌వ‌దీప్‌గా 2.Oగా స‌రికొత్త‌గా క‌నిపించ బోతున్న చిత్రం లవ్,మౌళి (Love Mouli). విభిన్న‌మైన, వైవిధ్య‌మైన ఈ చిత్రానికి అవ‌నీంద్ర (Avaneendra) ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో క‌లిసి నిర్మాణ పనులు టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ కి అడ్డాగా మారిన సి స్పేస్ భాధ్యతలు తీసుకుంది. ఈ చిత్రం నుంచి వ‌చ్చిన ప్ర‌తి అప్‌డేట్ వినూత్నంగా అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ లవ్,మౌళి (Love Mouli) చిత్రాన్ని ఏప్రిల్ 19న విడుద‌ల చేస్తున్నట్లు ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌. కాగా ఈ చిత్రం ట్రైల‌ర్‌ను ఇటీవ‌ల మాస్ కాదాస్ విశ్వ‌క్‌సేన్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ట్రైల‌ర్‌కు అద్బుత స్పంద‌న వ‌చ్చింది. ఇటీవ‌ల ఇలాంటి వైవిధ్య‌మైన ట్రైల‌ర్‌ను చూడ‌లేద‌ని అంతా కొనియాడుతున్నారు.

6edf49b9-fb27-4897-9728-63f634d6cacc.jpeg

కాగా మొద‌టిగా హైద‌రాబాద్ లో ల‌వ్,మౌళి (Love Mouli) ట్రైల‌ర్ ని లాంచ్ చేసి, అదే రోజు సాయంత్రం విశాఖ‌ప‌ట్నంలో సంగం థియేట‌ర్ ఇంట‌ర్వెల్‌లో ప్రేక్ష‌కులకి ట్రైల‌ర్‌ని స్క్రీనింగ్ చేసి వారితో సినిమా విశేషాలు పంచుకున్నారు, త‌రువాత రోజు పిఠాపురం వెళ్ళి ద‌త్త పీటాన్ని ద‌ర్శించుకుని ఈ ఎల‌క్ష‌న్స్ లో నిజాయితీగా ఉన్న వారిని గెలిపించండి.. నిజాయితీగా తీసిని సినిమాని ఆద‌రించండి అంటూ అక్క‌డి ప్ర‌జ‌ల‌కి తెలియ‌జేశారు. అక్క‌డి నుంచి కాకినాడ థియేట‌ర్ ప‌ద్మ‌ప్రియకి , రాజ‌మండ్రి అనుశ్రీ థియోట‌ర్స్ లో త‌న ట్రైల‌ర్‌తో హంగామా చేశారు.


త‌ద‌నంతరం రాజ‌మండ్రిలో ఫేమ‌స్ అయిన రొజ్ మిల్స్ సెంట‌ర్‌లో అభిమానుల్ని, ప్రేక్ష‌కుల్ని క‌లిసి వారితో ల‌వ్ మౌళి (Love Mouli) క‌బుర్లు చెప్పుకుంటూ వారితో క‌లిసి రొజ్ మిల్క్ ని తాగారు.మూడోరోజు ఏలూరు ఎస్‌విసి మ‌ల్టిప్లెక్స్ లో ట్రైల‌ర్ డైలాగ్స్ ని ప్రింట్ చేసిన టీ ష‌ర్ట్ప్ పంచుతూ వారికి ల‌వ్‌, మౌళి (Love Mouli) ట్రైల‌ర్ చూపించి వారి అభిప్రాయాల్ని సేక‌రించారు. అక్క‌డి నుంచి గుంటూరు మైత్రి మూవీస్ వారి మ‌ల్టిప్లెక్స్ లో హ‌ల్ చ‌ల్ చేశారు.. అక్క‌డి ప్రేక్ష‌కుల కొరిక‌తో రెండు స్క్రీన్స్ లో ట్రైల‌ర్ ని ప్ర‌ద‌ర్శించారు. అక్క‌డి వారితో మాట్లాడుతూ ప్రేమ గురించి వివ‌రించారు.

8560727a-4601-453d-b8cc-58c541ab43e6.jpeg

చివ‌రిగా విజ‌యవాడ రాజ్ యువ‌రాజ్ కాంప్లెక్స్ లో ట్రైల‌ర్ ని ప్ర‌ద‌ర్శించి మీడియాతో మాట్లాడారు. మొట్ట‌మొద‌టి సారిగా మూడు రోజులు, ఏడు సిటీస్‌లో ఎనిమిది స్క్రీన్స్ లో వేరోక సినిమా ఇంట‌ర్వెల్లో మా ట్రైల‌ర్ ప్ర‌ద‌ర్శించి రియ‌ల్ సినిమా ఆడియన్స్ ని క‌లిసి ట్రైల‌ర్ మీద వారి అభిప్రాయాలు తెలుసుకున్నా మ‌న్నారు. దీనికి స‌హ‌కారం అందించిన వారంద‌రికి న‌వ‌దీప్‌ (Navdeep) ద‌న్య‌వాదాలు తెలిపారు. ఈ టూర్ హీరో హీరోయిన్స్ ఫంకూరి గిద్వాని (Pankhuri Gidwani), భావ‌న, లిరిక్ రైట‌ర్ అనంత్ శ్రీరామ్ గారు హ‌జ‌ర‌య్యారు.

Updated Date - Apr 14 , 2024 | 06:30 PM