Laggam: ‘లగ్గం’ రిలీజ్ డేట్ పోస్టర్ వదిలిన నవ దళపతి

ABN, Publish Date - Sep 28 , 2024 | 08:03 PM

సుబిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘లగ్గం’. ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం రమేశ్ చెప్పాల. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో దూసుకెళుతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ని టాలీవుడ్ నవ దళపతి చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

సుబిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘లగ్గం’ (Laggam). ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం రమేశ్ చెప్పాల (Ramesh Cheppala). అక్టోబర్ 25న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాయి. తాజాగా ఈ ‘లగ్గం’ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను టాలీవుడ్ నవ దళపతి సుధీర్ బాబు (Nava Dalapathy Sudheer Babu) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేయడమే కాకుండా.. ఈ చిత్ర టీజర్‌ను చూసి.. యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు. టీజర్ చాలా బాగుందని, తెలుగు ప్రేక్షకులకు తెలుగుదనం నిండిన సినిమా‌ను ఇస్తున్న టీమ్ మొత్తానికి ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. (Laggam Release Date Poster)

Also Read- Devara Review: ‘దేవర’ మూవీ రివ్యూ

ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. చిత్రంలో నటీనటులు పూర్తి తెలంగాణ యాస మాట్లాడకుండా వాడుక భాషలో మాట్లాడుతారు. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది. ఇది ‘లగ్గం’ నామ సంవత్సరం కాబోతుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు, పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించగా.. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. అక్టోబర్ 25న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ఏషియన్ సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా గ్రాండ్‌గా విడుదల కానుంది.


‘లగ్గం’ సినిమా విషయానికి వస్తే.. ‘కుటుంబమంతా కలిసి చూడాల్సిన సినిమా లగ్గం’ అని నటకిరీటి రాజేంద్రప్రసాద్ అంటే.. ‘ప్రతి ప్రవాస భారతీయుడు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇదని, ప్రతి ఆడపిల్ల తండ్రి తన కూతురికి పెళ్లి చేసేముందు ఈ సినిమా చూడాలని అన్నారు ఎల్బీ శ్రీరామ్. చిత్ర నిర్మాత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రతి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇది. తెలుగుదనం నిండిన చక్కని చిత్రం. దర్శకుడు చాలా అందంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక మంచి సినిమా చూసిన ఫీల్ ప్రతి ఒక్కరికీ ఈ సినిమా ఇస్తుంది. అందులో ఎటువంటి అనుమానాలు అవసరం లేదు’ అని తెలిపారు. సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను వంటి తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తుండగా.. మణిశర్మ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.

Also Read- Jani Master Case: షాకింగ్ ట్విస్ట్.. విచారణలో జానీ మాస్టర్ ఏం చెప్పారంటే..

Also Read- Harsha Sai: అసలెవరీ హర్షసాయి.. మరో మెగాస్టార్ అంటూ బిల్డప్ ఇచ్చిన వారంతా ఏమయ్యారు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 28 , 2024 | 08:03 PM