Laggam: ‘లగ్గం’ ఆడియో రైట్స్ ఎవరికంటే..

ABN , Publish Date - Jun 15 , 2024 | 02:16 PM

సుభిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘లగ్గం’. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల రచన -దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ ఆడియో కంపెనీ అయిన ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. చరణ్ అర్జున్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Laggam: ‘లగ్గం’ ఆడియో రైట్స్ ఎవరికంటే..
Laggam Movie Still

ఇప్పుడంటే ఆడియో రైట్స్ గురించి పెద్దగా వినిపించడం లేదు కానీ.. ఇంతకు ముందు సినిమా బిజినెస్ మొదలయ్యేదే ఆడియో రైట్స్‌తో అనేది చాలా మందికి తెలుసు. ఇప్పటికీ స్టార్ హీరోల సినిమాల విషయంలో ఆడియో రైట్స్ పలానా కంపెనీకి అంటూ వార్తలు వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఓ చిన్న సినిమా ఆడియో రైట్స్ వార్తలలో నిలవడం విశేషం. సుభిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘లగ్గం’ (Laggam). ఈ సినిమాకు రమేశ్ చెప్పాల రచన -దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ ఆడియో కంపెనీ అయిన ఆదిత్య మ్యూజిక్ (Aditya Music) సంస్థ ఈ సినిమా ఆడియో రైట్స్‌ను (Laggam Audio Rights) ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Laggam-1.jpg

ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) మాట్లాడుతూ.. పెళ్లిలో ఉండే సంబురాన్ని, విందుని, చిందుని, కన్నుల విందుగా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇది కల్చరర్ ఫ్యామిలీ డ్రామా. ప్రతి ఒక్కరు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు. కొత్త అనుభవాన్ని కళ్ళముందు ఉంచే ఈ చిత్రం కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రమవుతుందని తెలిపారు.

Also Read- Niharika Konidela: అల్లు అర్జున్‌ని సాయి దుర్గా తేజ్ అన్ ఫాలో చేయడంపై నిహారిక స్పందనిదే..


Laggam-2.jpg

చిత్ర నిర్మాత వేణుగోపాల్ రెడ్డి (Venu Gopal Reddy) మాట్లాడుతూ.. మంచి సినిమాలను ప్రేక్షకులకు అందివ్వాలనే ధ్యేయంతో ఈ బ్యానర్ స్థాపించాం. ‘లగ్గం’ అంటూ అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు చిత్రాన్ని ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. చరణ్ అర్జున్ (Charan Arjun) సంగీతం అందించిన పాటలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఆదిత్య మ్యూజిక్ సంస్థ ద్వారా మా సినిమా పాటలు మార్కెట్లోకి విడుదల కానున్నాయి. జూన్ 21న ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను ఓ ప్రముఖ దర్శకుడి చేతుల మీదుగా విడుదల చేయబోతున్నాం. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ ‘లగ లగ లగ్గం’ సాంగ్ అందరినీ అలరిస్తుంది. మిగతా వివరాలను త్వరలోనే తెలియజేస్తామని అన్నారు.

Read Latest Cinema News

Updated Date - Jun 15 , 2024 | 02:16 PM