Laggam: ప్రతి ఒక్కరి ‘లగ్గం’ నాటి రోజులని గుర్తు చేసేలా ఉంటుందీ సినిమా..
ABN , Publish Date - Aug 29 , 2024 | 04:33 PM
సుభిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘లగ్గం’. రమేశ్ చెప్పాల కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లిలో ఉండే విందు, చిందు కన్నుల పండుగగా ఇందులో చూపించబోతున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను హీరో ఆది సాయికుమార్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.
సుభిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి (Venu Gopal Reddy) నిర్మిస్తున్న సినిమా ‘లగ్గం’ (Laggam). రమేశ్ చెప్పాల (Ramesh Cheppala) కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లిలో ఉండే విందు, చిందు కన్నుల పండుగగా ఇందులో చూపించబోతున్నారు. ఇది తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారని అంటున్నారు మేకర్స్. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్‌తో పాటు హీరో ఆది సాయికుమార్ (Aadi Saikumar) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Also Read- Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ మూవీ రివ్యూ
ఈ కార్యక్రమంలో హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. ‘లగ్గం’ టీజర్ చాలా బాగుంది, విజువల్స్ నేచురల్‌గా ఉన్నాయి. డైరెక్టర్ రమేష్ చెప్పాలగారు మంచి టేస్ట్‌తో ఈ సినిమాను తీశారనిపిస్తోంది. నిర్మాత వేణుగారికి, చిత్రయూనిట్ సభ్యులందరికి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ఈ సినిమాలో నటించిన రాజేంద్రప్రసాద్‌గారితో, రోహిణిగారితో, కృష్ణుడుగారితో నాకు మంచి ట్రావెల్ ఉంది. నాకు బాగా దగ్గరివారందరు ఈ సినిమాలో ఉండడం సంతోషంగా ఉంది, ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. (Laggam Movie Teaser Released)
డైరెక్టర్ రమేష్ చెప్పాల మాట్లాడుతూ.. ‘లగ్గం’ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నిర్మాత వేణు గోపాల్ రెడ్డిగారు ఈ సినిమా కథను నమ్మి ఈ సినిమాను నిర్మించారు. అలాగే రాజేంద్రప్రసాద్‌గారు ఈ సినిమాను తన భుజాలపై తీసుకెళ్లిన విధానం అందరినీ అలరిస్తుంది. కథ, కథనం ఈ సినిమాకు బలం. కుటుంబం మొత్తం కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా చూసే వారంతా.. తమ ‘లగ్గం’ నాటి రోజులని గుర్తు చేసుకుంటారు. పెళ్లి కాని వారు ఇలా తమ లగ్గాన్ని చేసుకోవాలని అనుకుంటారు. టీజర్‌కు వస్తోన్న రెస్పాన్స్ చాలా బాగుందని, ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలని తెలిపారు.
నిర్మాత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మంచి సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు డైరెక్టర్ రమేష్ చెప్పాల తీసిన ‘భీమదేవరపల్లి’ సినిమా చూశాను. చాలా బాగా నచ్చి వెంటనే రమేష్‌తో సినిమా చేయాలని అనుకున్నాను. ఈ క్రమంలో రమేష్‌గారు ‘లగ్గం’ కథ చెప్పడం జరిగింది. కథ నచ్చి వెంటనే సినిమా స్టార్ట్ చేశాం. మంచి స్టోరీ, స్క్రీన్‌ప్లే, ఫీల్ గుడ్ సాంగ్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుందని భావిస్తున్నానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటి రోహిణి, హీరో సాయి రోనక్, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, ఎడిటర్ బొంతల నాగేశ్వరరెడ్డి వంటి వారంతా మాట్లాడుతూ.. ఈ సినిమాకు పనిచేసే అవకాశం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Read Latest Cinema News