మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Devara: ‘దేవర’ రిలీజ్ డేట్ మారింది.. ముందే వచ్చేస్తోన్న టైగర్..

ABN, Publish Date - Jun 13 , 2024 | 05:28 PM

మాన్‌ ఆఫ్‌ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా.. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండ‌గా... బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్ సైఫ్‌ అలీ ఖాన్ కీల‌క పాత్ర‌లో మెప్పించ‌నున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌ను అక్టోబర్ 10న అని మేకర్స్ చెప్పినా.. ఇప్పుడు ఆ డేట్ కంటే ముందే సెప్టెంబర్ 27నే సినిమా రిలీజ్ కాబోతోంది.

Devara Release Date Poster

మాన్‌ ఆఫ్‌ మాసెస్ ఎన్టీఆర్ (Man of Masses NTR) హీరోగా.. కొర‌టాల శివ (Koratala Siva) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’ (Devara). ప్రపంచస్థాయిలో బజ్‌ క్రియేట్‌ చేస్తున్న సినిమా ఇది. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండ‌గా... బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్ సైఫ్‌ అలీ ఖాన్ కీల‌క పాత్ర‌లో మెప్పించ‌నున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌ను అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ డేట్ కంటే ముందే ‘దేవర’ విడుదల కాబోతోంది. అవును.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ (Jr NTR Fans)కు ‘దేవర’ టీమ్ తాజాగా అదిరిపోయే అప్‌డేట్‌ను ఇచ్చారు. ఈ సినిమాను సెప్టెంబర్ 27నే విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. అధికారికంగా ఓ పోస్టర్ వదిలారు. దీంతో తారక్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ.. టీమ్‌కు థ్యాంక్స్ చెబుతున్నారు. (Devara New Release Date)

Also Read- Mega vs Allu: మరోసారి రివీలైన మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య యుద్ధం

ఇక ఈ పోస్టర్‌లో సముద్రం ఒడ్డున యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్షన్‌లో ఉన్నారు. శత్రువులను ఊచకోత కోస్తున్నట్లుగా పోస్టర్‌ని అద్భుతంగా డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. ఇంతకు ముందు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన కంటెంట్.. సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలను పెంచేశాయి. రీసెంట్‌గా తారక్ పుట్టినరోజు స్పెషల్‌గా వదిలిన ‘ఫియర్ సాంగ్’ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళంలో భాష‌ల్లోనూ ఈ పాటను విడుదల చేయగా.. అన్ని భాషల్లోనూ మంచి స్పందనను రాబట్టుకుంది. తమిళ సంచలనం అనిరుద్ ర‌విచంద‌ర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. (Devara Movie)


‘దేవర’గా టైటిల్ పాత్ర‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, న‌రైన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ అప్‌డేట్‌తో మరోసారి ‘దేవర’ ట్యాగ్‌ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Read Latest Cinema News

Updated Date - Jun 13 , 2024 | 05:28 PM