Bhagyashri Borse: టాలీవుడ్‌ని ఏలేయడం పక్కా..

ABN , Publish Date - Jul 31 , 2024 | 12:31 AM

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమా ప్రేక్షకులకు అల్టిమేట్ ఎంటర్‌టైన్మెంట్ అందించడానికి రెడీగా అవుతోంది. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఆమె ఈ చిత్రానికి తన డబ్బింగ్‌ను పూర్తి చేసినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Heroine Bhagyashri Borse

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) మాస్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan). ఈ సినిమా ప్రేక్షకులకు అల్టిమేట్ ఎంటర్‌టైన్మెంట్ అందించడానికి రెడీగా అవుతోంది. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, షో రీల్, టీజర్ మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేయగా.. ఇప్పుడీ సినిమాలోని హీరోయిన్‌కు సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏంటా వార్తలు అనుకుంటున్నారా?

Bhagyasri-Borse-1.jpg

తాజాగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాకు డబ్బింగ్‌ను కంప్లీట్ చేసినట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే తన క్యారెక్టర్‌కు భాగ్యశ్రీ బోర్సే సొంతంగా డబ్బింగ్ చెప్పడం గమనార్హం.

Bhagyasri-Dubbing.jpg

తెలుగు తన మాతృభాష కాకపోయినప్పటికీ కష్టపడి నేర్చుకొని తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. ఈ విషయంలో ఆమె డెడికేషన్, ప్రొఫెషనలిజంను చూసిన వారంతా.. ఈ భామ టాలీవుడ్‌ని ఏలేయడం పక్కా అంటూ ప్రశంసిస్తుండటం విశేషం. (Bhagyashri Borse Telugu Dubbing)


Bhagyasri-Borse.jpg

ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ‘సితార్, రెప్పల్ డప్పుల్ సాంగ్స్’, టీజర్‌లో తన బ్యూటీఫుల్ స్క్రీన్‌ప్రజెన్స్‌తో ఆడియన్స్‌ని భాగ్యశ్రీ మెస్మరైజ్ చేశారు. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ భామ ఫోటోలే వైరల్ అవుతున్నాయి. ఒక్క సినిమా కూడా విడుదలకాకముందే.. ఆమెను టాలీవుడ్ అప్ కమింగ్ క్రేజీ హీరోయిన్ అంటుండటం విశేషం. భాగ్యశ్రీ పెర్ఫార్మెన్స్‌ని బిగ్ స్క్రీన్‌పై చూడటానికి ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ (TG Vishwa Prasad) ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Bhagya-Sri-Borse.jpg

Bhagyasri-Borse-3.jpg

Updated Date - Jul 31 , 2024 | 12:31 AM

Mr Bachchan: అంత ఆసక్తికరంగా లేని మిస్టర్ బచ్చన్' టీజర్

Mr Bachchan: స్పీకర్స్ బద్దలయ్యే ‘రెప్పల్ డప్పుల్’ సాంగ్ వచ్చేసింది

Mr Bachchan: రవితేజ ‘మిస్టర్ బచ్చన్‌’లో జగ్గు భాయ్ అవతార్ చూశారా..

Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ మాస్ అండ్ యాక్షన్-ప్యాక్డ్ షోరీల్ వీడియో

Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ మూవీలోని సితార్ లిరికల్ సాంగ్